America : కరోనా తర్వాత భారీగా ఉద్యోగాలకు రాజీనామా చేస్తోన్న అమెరికన్లు

అమెరికాలో మాత్రం సీన్‌ రివర్స్ అయ్యింది. కరోనా తర్వాత ఉద్యోగుల వైఖరి మారిపోయింది. దేశంలో ఇప్పుడు ది గ్రేట్ రిజిగ్నేషన్ విప్లవం నడుస్తోంది. పెద్ద ఎత్తున ఉద్యోగాలను వదిలేస్తున్నారు.

America : కరోనా తర్వాత భారీగా ఉద్యోగాలకు రాజీనామా చేస్తోన్న అమెరికన్లు

America

The Great Resignation in America : ఉద్యోగం వచ్చిందంటే చాలు..ఎగిరి గంతేస్తారు..ఎవరైనా….ఎన్ని ఒత్తిళ్లున్నా సరే…జాబ్ మానేయడానికి ఇష్టపడరు. ఉద్యోగం ఉంటేనే జీవితానికి భద్రత ఉందనుకుంటారు. నెలవారీ వచ్చే జీతంతో…జీవితం హాయిగా గడిచిపోతుందని భావిస్తారు. పని ఒత్తిడి పెరిగినా, బాస్‌తోనో, సహోద్యోగులతోనో విభేదాలు వచ్చినా, విధుల్లో అసంతృప్తి ఉన్నా..ఎలాగోలా సర్దుకుపోతారు తప్ప….జాబ్ వదిలిపెట్టేందుకు ఏమాత్రం ఇష్టపడరు. కానీ అమెరికాలో మాత్రం సీన్‌ రివర్స్ అయ్యింది. కరోనా తర్వాత ఉద్యోగుల వైఖరి మారిపోయింది.

వర్క్ ఫ్రమ్ హోంతో పాటు మహమ్మారి సమయంలో కొందరు ఉద్యోగాలు కోల్పోవడం, సొంత వ్యాపారాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం, జాబ్‌ లేకపోతే కలిగే ఇబ్బందులును అధిగమించడంలో అనుభవం పొందడం వంటివన్నీ అమెరికన్ల ఆలోచనావిధానాన్ని మార్చేశాయి. ఆ దేశంలో ఇప్పుడు ది గ్రేట్ రిజిగ్నేషన్ విప్లవం నడుస్తోంది. పెద్ద ఎత్తున ఉద్యోగాలను వదిలేస్తున్నారు. వేలంవెర్రిగా జాబ్‌లకు రిజైన్స్‌ చేస్తున్నారు.

Airplane Human Waste : ఎగిరే విమానంలో నుంచి మానవ వ్యర్థాలు.. గార్డెన్‌లో వ్యక్తికి భయానక అనుభవం!

అమెరికాలో ప్రస్తుతం కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న వారి సంఖ్య కంటే…జాబ్‌లు వీడుతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉందంటే…అమెరికన్లలో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క ఆగస్టులోనే 43లక్షలమంది అమెరికన్లు ఉద్యోగాలకు రాజీనామా చేశారంటే.. వాళ్లకు పిచ్చి ఏ స్థాయిలో పెరిగిపోయిందో అర్ధమవుతోంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారితో పోలిస్తే…రిజైన్ చేసిన వారి సంఖ్య 2.9శాతం ఎక్కువగా ఉంది. ఉద్యోగం లేకపోవడంతో గత ఏడాదంతా….ఇతర పనులు చేస్తూ బిజీగా గడిపామని…అప్పుడే ఈ ఆలోచన వచ్చిందని ఓ ఉద్యోగి చెప్పారు.

రోజూ ఎంత సమయం వెచ్చిస్తున్నాం…అందుకు ఎంత ప్రతిఫలం దక్కుతుంది అన్నది…రోజువారీ జాబ్‌పై పునరాలోచనలో పడేసిందని తెలిపారు. మెరుగైన పనివేళలు, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వంటివి ఉద్యోగులు కోరుకుంటున్నారని, మొత్తంగా ఉద్యోగులు మార్పు కోరుకుంటున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Russia : వారం రోజులు ఆఫీసులు బంద్..కానీ జీతమిస్తాం

అమెరికా అంతటా రిజిగ్నేషన్ కార్యక్రమం నడుస్తుండడంతో…కొత్త ఉద్యోగాల భర్తీ కంపెనీలకు సవాలుగా మారింది. దేశంలోని మొత్తం ఉద్యోగుల్లో సగానికి పైగా వచ్చే ఏడాది తాము కొత్త ఉద్యోగంలో చేరాలని భావిస్తున్నట్టు ఓ సర్వేలో వెల్లడించారు. 56శాతం ఉద్యోగులు పనివేళల్లో, పని ప్రదేశాల్లో మార్పులు కావాలని కోరారు. పిల్లల పెంపకం, వారి బాగోగులు పట్టించుకోవడం వంటి అదనపు బాధ్యతలు ఉన్న మహిళా ఉద్యోగులు..మగవాళ్లతో పోలిస్తే..ఎక్కువ సంఖ్యలో రాజీనామాలు సమర్పిస్తున్నారు.

ది గ్రేట్ రిజిగ్నేషన్, ఐ క్విట్‌ ది జాబ్‌ పేరుతో ఇలా ఉద్యోగులు రిజైన్‌ చేస్తుండడం కంపెనీలకు పెద్ద తలనొప్పిగా మారింది. కొత్త ఉద్యోగులు దొరక్క ఆయా సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. మరోవైపు దేశంలో నిరుద్యోగిత పెరిగిపోవడం ప్రభుత్వాన్ని కూడా టెన్షన్ పెడుతోంది.