Airplane Human Waste : ఎగిరే విమానంలో నుంచి మానవ వ్యర్థాలు.. గార్డెన్‌లో వ్యక్తికి భయానక అనుభవం!

సాధారణంగా ఆకాశంలో ఎగిరే పక్షులు వ్యర్థాలను నేలపై వదులుతుంటాయి. ఈ వ్యర్థాలు మనుషులపై పడటం వంటి ఘటనలు కూడా సర్వసాధారణమే. విమానంలో నుంచి మానవ వ్యర్థాలు పడటం ఇప్పుడు కలకలం రేపింది.

Airplane Human Waste : ఎగిరే విమానంలో నుంచి మానవ వ్యర్థాలు.. గార్డెన్‌లో వ్యక్తికి భయానక అనుభవం!

Airplane Drops Human Waste On Man In His Garden Near Windsor Castle

Airplane drops human waste : సాధారణంగా ఆకాశంలో ఎగిరే పక్షులు వ్యర్థాలను నేలపై వదులుతుంటాయి. ఈ వ్యర్థాలు మనుషులపై పడటం వంటి ఘటనలు కూడా సర్వసాధారణమే. అయితే విమానంలో నుంచి మానవ వ్యర్థాలు పడటం ఇప్పుడు కలకలం రేపింది. గార్డెన్‌లో పనిచేసుకుంటున్న ఓ వ్యక్తిపై విమానంలో నుంచి మానవ వ్యర్థాలు పడ్డాయి.

అంతే అతడికి చిర్రెత్తుకొచ్చింది. విమానంలో నుంచి జారవిడిచిన వ్యర్థాలు అతడిపైనే కాదు.. గార్డెన్‌లో గడ్డి, గొడుగులపై కూడా పడ్డాయి. ఇంగ్లండ్‌లోని విండ్సర్‌ (Windsor Castle)కు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2021 ఏడాది జూలైలో ఈ ఘటన జరగ్గా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీనిపై సంబంధిత క్లెవెర్ ఈస్ట్ కౌన్సిలర్ కారెన్ డావీస్ కూడా స్పందించారు.
New T20 Captain: టీమిండియా టీ20 కెప్టెన్‌ బాధ్యతలు ఇక అతడికే..!

విండ్సర్ అండ్ మేడెన్ హెడ్‌కి చెందిన ది రాయల్ బోరో ఏవియేషన్ ఫోరమ్‌తో ఆమె మాట్లాడారు. విమానంలో నుంచి పడిన వ్యర్థాలు మొత్తం గార్డెన్ తో పాటు గొడుగులపై పడ్డాయని కారెన్ డావిస్ చెప్పారు. ప్రతి ఏడాదిలో ఇలాంటి ఘటనలు సాధారణంగా జరుగుతుంటాయి. గడ్డ కట్టిన వ్యర్థాలు విమానాల్లో నుంచి పడుతున్నాయి. తాజాగా ఈ ఘటనలో మాత్రం గడ్డకట్టిన వ్యర్థాలు పడలేదు. చెల్లాచెదురుగా పడిపోయాయని తెలిపారు. వ్యర్థాలు పడిన వెంటనే అతడు గార్డెన్ నుంచి దూరంగా పరుగెత్తాడు.

బాధితుడికి అదో భయంకరమైన అనుభవంగా పేర్కొన్నారు. సాధారణంగా విమానాల్లో టాయిలెట్స్‌ వ్యర్థాలను ప్రత్యేక ట్యాంకుల్లో స్టోర్ చేస్తుంటారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆయా వ్యర్థాలను తొలగిస్తారు. రూట్ ట్రాకింగ్ యాప్ ద్వారా ఆ విమానం ఎటు వెళ్లిందో బాధితుడు కనిపెట్టాడు. ఆ విమానం పేరును బయటపెట్టలేదు.
Google Pixel 6 ఫోన్ వచ్చేసిందిగా.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత? సేల్ ఎప్పుడంటే?