కరోనాతో మరణించిన గ్రామీ అవార్డు గ్రహీత

  • Publish Date - April 2, 2020 / 06:39 AM IST

సంగీత ప్రపంచంలో ప్రతిభకు గుర్తింపుగా ఇచ్చే ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డు గ్రహీత.. పాటల రచయిత, గాయకుడు ఆడమ్‌ ష్లెసింగర్‌(52) కరోనా వైరస్ కారణంగా కోవిడ్ వ్యాధితో చనిపోయాడు. గ్రామీ, ఎమ్మీ అవార్డు గ్రహిత అయిన ఆడమ్‌ ష్లెసింగర్‌ పాప్‌ రాక్‌బాండ్‌ ఫౌంటైన్స్‌ ఆఫ్‌ వేన్‌ సహ వ్యవస్థాపకుడు. ఆడమ్‌ మరణాన్ని ఇటీవల కరోనా బారిన పడిన నటుడు టామ్‌ హంక్స్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

ఆడమ్‌ ష్లెసింగర్‌ లేకుండా ప్లేటోన్‌ ఉండదని, అతడు కోవిడ్‌-19 చేతిలో ఓడిపోయాడంటూ భావోద్వేగ సందేశం పెట్టాడు. ఇది విచారకర రోజు అంటూ టామ్‌ హంక్స్‌ ట్వీట్‌ చేశాడు. కాగా టామ్‌, అతని భార్య రీటా విల్సన్‌కు గత నెలలో కరోనా వైరస్‌ సోకగా.. కొన్ని వారాలపాటు ఆస్ట్రేలియాలో క్వారంటైన్‌లో ఉండి ఇప్పుడు అమెరికాలోని తమ ఇంటికి చేరుకున్నారు.

ఆడమ్‌ 1995లో న్యూయార్క్‌లో ఫౌంటైన్స్‌ ఆఫ్‌ వేన్‌ అనే రాక్‌ బ్యాండ్‌ను స్థాపించారు. హాంక్స్‌ చిత్రం ’దట్‌ ధింగ్‌ యు డు’ చిత్రానికి పాటల రచయితగా పనిచేశారు ష్లెసింగర్‌. ఈ చిత్రం ఆస్కార్‌, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుకు ఎంపికైంది. ఆడమ్‌ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుతోపాటు అన్ని ప్రధాన అవార్డులను దక్కించుకున్నారు. 2009 లో ‘ఎ కోల్బర్ట్‌ క్రిస్మస్‌’కి గాను ఆడమ్‌కి గ్రామీ అవార్డు దక్కింది.

Also Read |  ఔషదాలు, Medical Devicesలపై ధరల నియంత్రణ, రేట్లు ఫిక్స్