Six Die In Private Plane Crash In Haiti Officials
Plane Crash: కరేబియన్ దేశమైన హయాతిలో విమానం కూలి ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. రాజధాని నగరం పోర్ట్ ఆ ప్రిన్స్‌కు నైరుతి దిశగా ప్రయాణిస్తుండగా ఘటన జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. సిటీ ఎయిర్‌పోర్ట్ లో సాయంత్రం 6గంటల 57నిమిషాలకు బయల్దేరిన ఎయిర్‌క్రాఫ్ట్ హయాతి దక్షిణ తీరమైన జాక్మెల్ కు చేరాల్సి ఉందని నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆఫీస్ తెలిపింది.
బాధితుల్లో ఇద్దరు అమెరికన్లు ట్రెంట్ హాసిలర్ 35, జాన్ మిల్లర్ 43 ఫేస్ బుక్ పేజిల్లో చేసిన పోస్టు ఆధారంగా ప్రయాణం గురించి వివరాలు స్పష్టమయ్యాయి. వారంతా పెద్ద గ్రూప్ గా ఏర్పడి రెండు విమానాల్లో బయల్దేరినట్లు అధికారులు తెలుసుకున్నారు.
మరో విమానంలో బయల్దేరాల్సిన వారు ఈ ప్రమాదం గురించి తెలుసుకుని ముందే ఆగిపోయారని ఎయిర్ పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు. ఘటనపై స్పందించిన NCAO ఆరుగురు ప్రయాణిస్తున్న విమానం కూలి అక్కడికక్కడే మృతి చెందారని చెప్పింది. నిఘా సంస్థలు అక్కడికొచ్చి మృతుల వివరాలు సేకరించింది.