పార్టనర్ల కంటే పెట్స్‌‌‌ ఎంతో బెటర్.. నిద్రకు ఆటంకమే ఉండదట!

  • Publish Date - December 12, 2020 / 03:23 PM IST

Sleeping with a dog in bed better sleep : మనిషికి నిద్ర ఎంతో అవసరం.. ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్రపోవాలంటారు. లేదంటే అనారోగ్యాలను జీవితంలో ఆహ్వానించనట్టే.. అయితే చాలామంది తాము బెడ్ పై నిద్రించే సమయంలో ఎక్కువగా పెట్స్ తో నిద్రిస్తుంటారు. పార్టనర్ల కంటే పెంపుడు జంతువులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు.

మంచి నిద్ర కోరుకునేవారికి ఇదెంతో మేలు చేస్తుందని అంటున్నారు పరిశోధకులు. మనుషుల కంటే పెంపుడు జంతువులతోనే నిద్రిస్తే నిద్ర చక్కగా పడుతుందని కొత్త పరిశోధనలో తేలింది. అందులోనూ బెడ్‌పై పెట్ డాగ్‌తో నిద్రించడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తోందని రుజువైంది. వాస్తవానికి పార్టనర్లతో కంటే పెట్స్‌తో నిద్రించేడమే బెటర్ అంటోంది.

న్యూయార్క్‌లోని Canisius College నుంచి Christy L. Hoffman అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో మనుషుల కంటే పెంపుడు జంతువులతోనే ఆటంకం లేకుండా నిద్రపోవచ్చునని పరిశోధకులు తెలిపారు. అమెరికాలో మొత్తం 962 మంది మహిళలపై పరిశోధకులు అధ్యయనం చేశారు.

వీరిలో 55 శాతం మంది తమ నిద్రలో కనీసం ఒక పెట్ డాగ్ తో నిద్రించారు. 57శాతం మంది తమ పార్టనర్లతో నిద్రించారు. మరో 31శాతం మంది కనీసం ఒక పిల్లితోపాటు నిద్రించారు. మనుషులు, పిల్లులతో కంటే పెట్ డాగ్స్‌తోనే నిద్ర చాలా సౌకర్యవంతంగా ఎలాంటి నిద్రకు భంగం కలగలేదని పరిశోధకులు గుర్తించారు.

నిద్రించే సమయంలో చాలామంది పెట్స్‌ను హత్తుకుని నిద్రిస్తుంటారు. కొంతమంది బెడ్‌పై దిండు కవర్లను హత్తుకుని నిద్రిస్తుంటారు. వీరిలో ఎక్కువమంది తమ పార్టనర్ల కంటే పెట్స్‌తో నిద్రే ఎక్కువగా ప్రశాంతంగా ఫీల్ అయినట్టు రీసెర్చర్లు గుర్తించారు. మనుషులు, పెట్ డాగ్స్, అసలు ఎవరూ లేకుండా నిద్రించినవారి కంటే పెట్ డాగ్స్‌తోనే ఎక్కువ సౌకర్యవంతంగా, సెక్యూరిటీగా ఫీల్ అయినట్టు గుర్తించారు.

పిల్లుల యజమానులకు వాటి గోలతో ఎక్కువ సార్లు మేల్కుంటే.. పెట్ డాగ్ యజమానులు మాత్రం హాయిగా ఎక్కువ సమయం అంతరాయం లేకుండా నిద్రించారు. ఎందుకంటే డాగ్స్ స్లీప్ షెడ్యూల్ ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. నిద్రలో అంతరాయం లేకుండా ఎక్కువ సమయం నిద్రిస్తాయి. అందుకే డాగ్ యజమానులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు..

ట్రెండింగ్ వార్తలు