Oldest Grape Tree: ప్రపంచంలోనే అత్యంత పురాతనన ద్రాక్ష పాదు..ఇప్పటికీ దీని పండ్లతో తయారైన వైన్ కు ఫుల్ డిమాండ్

ప్రపంచంలోనే అత్యంత పురాతనన ద్రాక్ష పాదు..ఇప్పటికీ పండ్లను కాస్తునే ఉంది. ఈ పండ్లు ఒక్కసారైనా రుచి చూడాలని ఎంతోమంది ఆశపడతారు.ఈ పండ్లతో తయారైన వైన్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ డిమాండ్

Slovenia Oldest Grape Tree : ద్రాక్ష. పచ్చని నల్లని ఎర్రని రంగుల్లో కాసే ద్రాక్షల్లో దాదాపు 60 రకాల జాతులున్నాయి. ద్రాక్ష పాదా? చెట్టా అంటే? అనటానికి చెట్టు అని అంటారు గానీ ఇది పాదుల పాకుతుంది. అటువంటి ద్రాక్ష చెట్టు ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. ద్రాక్షను అత్యంత ప్రాచీన కాలంనుంచి పండిస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ ద్రాక్ష చెట్టు అదేనండీ పాదు ప్రపంచ రికార్డు సంపాదించింది. గిన్నీస్ బుక్ లోకి ఎక్కింది. అత్యంత ప్రాచీనమైన ద్రాక్షచెట్టుగా రికార్డు కొట్టేసింది.ఈ ద్రాక్ష చెట్టు గురించి తెలిస్తే గిన్నిస్ రికార్డు కూడా తక్కువేననిపిస్తుంది. అత్యంత ప్రాచీనమైన ఈ ద్రాక్ష చెట్టు వయస్సు 500 ఏళ్లకు పైనే. అయినా ఇది ఇప్పటికీ గుత్తులు గుత్తులుగా కాస్తునే ఉంది. ఈ ప్రాచీన ద్రాక్ష చెట్టుకు కాసిన పండ్లు అంటే ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ డిమాండ్ఉంది. బహుశా ఈ భూమ్మీద ఇటువంటి అత్యంత ప్రాచీనమైన ద్రాక్ష చెట్టు లేదేమో కూడా.

1570 సంవత్సరం నాటిదని చెబుతున్న ఈ ద్రాక్ష పాదు ఇప్పటికి పుష్కలంగా పండ్లను విరగకాస్తోంది. ఈ పండ్లతో అద్భుతమైన వైన్ కూడా తయారవుతోంది. దీంతో ఇది ప్రపంచ రికార్డుల్నే బద్దలు కొడుతోంది ఈ ప్రాచీన ద్రాక్ష చెట్టు. ఈ ప్రాచీన అద్భుతమైన ద్రాక్ష చెట్టు ఐరోపాలో దేశాల్లో ఒక్కటైన స్లోవేనియాలోని మారిబోర్‌లో ఉంది. ఈ చెట్టు ప్రపంచ యుద్ధంతో సహా ప్రపంచంలోని అనేక ముఖ్యమైన సంఘటనల కంటే పాతది కావటంతో దీనికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపే కాకుండా దీని పండ్లకు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఉంది.

Read more : General Sherman tree : 2,300 ఏళ్ల వయస్సున్న భారీ వృక్షానికి అల్యూమినియం కవర్

ఇంత ప్రాచీనమైన ఈ ద్రాక్ష చెట్టుకు కాసే పండ్లను ఒక్కసారైనా రుచి చూడాలని ఎంతోమంది తహతహలాడుతుంటారు. దీంతో ఎంత ధర అయినా సరే కొనుక్కొంటారు. ఈ చెట్టు నుంచి వచ్చే ద్రాక్ష రుచి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందంటారు ఈ పండ్లను తిన్నవారు. ఈ చెట్టు తీగలో చాలా ద్రాక్ష గుత్తులు గుత్తులుగా విరగకాస్తుంటాయి. ఇంకా ఈ పురానత ద్రాక్ష తీగ గురించి చెప్పుకోవాలంటే దీని వయస్సు 500 సంవత్సరాల కంటే ఎక్కువేనంటున్నారు నిపుణులు.

1570 సంవత్సరం నాటి ఈ ద్రాక్ష తీగ ‘ది ఓల్డ్ వైన్ హౌస్’ అనే భవనం చుట్టూ విస్తరించి ఉంది. ఒక నివేదిక ప్రకారం ఈ సంవత్సరం కూడా ఈ చెట్టుకు ప్రతి సంవత్సరం 35 నుండి 55 కిలోల ద్రాక్ష పండ్లు ఉత్పత్తి అవుతాయని అంచనా. ఈ పండ్లనుంచి వెరీ టేస్టీ వైన్ తయారవుతుంది. దీని పండ్లు చాలా రుచిగా ఉంటాయట. దీంతో ఈ పండ్లనుంచి తయారైన వైన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది.ఈ పండ్లతో తయారైన వైన్ 100 సీసాలు సంవత్సరంలో ఉత్పత్తి చేయబడుతున్నాయట.

Read more : విచిత్రం : చెట్టును నరికితే నీళ్లొస్తున్నాయి

ఈ ద్రాక్ష చెట్టు ఎన్నో యుద్ధాల్ని చవిచూసింది.ఈ ద్రాక్ష తీగపై ఎన్నోసార్లు మంటలు చెలరేగాయి. ఎన్నో చీడపీడలు ఆవహించాయి. ఆకుల్ని తినేశాయి.మొత్తం మోడుగా చేసేశాయి. అయినా అన్నింటినీ తట్టుకుంది. నిలబడిది. పాకింది. పండ్లనిస్తునే ఉంది. ఇంతటి ప్రాచీనమైన ఈ ద్రాక్ష తీగను సంరక్షించటానికి ఓ ప్రత్యేక బృందం కూడా ఉంది. ఎన్నో ఆటుపోటుల్ని తట్టుకుని నిలబడి ఇప్పటికీ రుచికరమైన పండ్లను కాస్తునే ఉందని ఈ ద్రాక్ష తీగను సంరక్షిస్తున్న నిర్వాహకులు తెలిపారు.

 

ఈ ద్రాక్ష పండ్ల నుంచి తయారైన వైన ను ఎంతోమంది ప్రముఖులకు బహుమతులుగా ఇచ్చారు. వారిలో దలైలామా, బిల్ క్లింటన్, పోప్ జాన్ పాల్ II, నటుడు బ్రాడ్ పిట్ లకు ఈ చెట్టు నుండి తయారు చేసిన వైన్ టేస్ట్ చూశారు. కాగా స్లోవేనియాలో అనేక ప్రదేశాలలో ద్రాక్ష పంటలు విరివిగా కాస్తాయి.

ట్రెండింగ్ వార్తలు