విచిత్రం : చెట్టును నరికితే నీళ్లొస్తున్నాయి

  • Published By: bheemraj ,Published On : June 16, 2020 / 07:09 PM IST
విచిత్రం : చెట్టును నరికితే నీళ్లొస్తున్నాయి

ఈత చెట్లకు గాటు పెడితే ఈత కల్లు, తాటి చెట్టుకు గాటు పెడితే తాటి కల్లు కారుతుంది. వేప చెట్టుకు కూడా గాటు పెడితే వేప కల్లు వచ్చే విషయం తెలిసిందే. అలాగే కొన్ని చెట్లను నరికినప్పుడు దాని నుంచి పాలు కారుతాయి. కానీ తమిళనాడులోని ఒక చెట్టును కత్తితో నరికితే నీళ్లు కారుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి దిగ్విజయ్ సింగ్ ఖాటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఓ చెట్టును కత్తితో నరకగానే నీళ్లు ఒక్కసారిగా బయటకు వస్తున్నాయి. ఈ చెట్లను టెర్మినాలియా టోమెంటోసా అంటారని, ఇవి కాండాల్లో నీటిని నిల్వ ఉంచుకుంటాయని అధికారులు తెలిపారు. ఈ చెట్లను అశాన్, అశ్నా, సజ్ అని కూడా పిలుస్తారని చెప్పారు. 

Read: భారత్-చైనా సరిహద్దుల్లో 20మంది జవాన్లు మృతి