Collapse Of Humans : 20 ఏళ్లలో మనుషులు అంతమైపోతారా?

మానవ సమాజం మరో 20 ఏళ్లలో అంతం అయిపోతుందని ఓ అధ్యయం పేర్కొంది. మానవ సమాజం చారమాంకంలో ఉంది. కేవలం 2 దశాబ్దాల్లో అది అంతం అయిపోవచ్చు అని తాజాగా పరిశోధనల్లో వెల్లడించింది.

Society will collapse in 21st century: ఈ భూమ్మీద మనిషి ఎప్పుడు పుట్టాడు? ఎలా పుట్టాడు?మొదటి మానవుడు ఎలా అవతరించాడు? అనే ఎన్నో ప్రశ్నలకు చరిత్రకారులు అధ్యయనాలను బట్టి ఎన్నో సమాధానాలు చెబుతుంటారు. కానీ మానవ సమాజం అంతం గురించి మాత్రం స్పష్టమైన అధ్యయనం లేదు.. నిరంతరం ఏదో ఒక కొత్త అంశం తెరమీదకు వస్తునే ఉంటుంది. ఎన్నోరోజులుగా త్వరలో మానవాళి అంతం అయిపోతుందంటూ వస్తున్న పుకార్లు వింటూనే ఉన్నాం.. అవి కేవలం పుకార్లేనని కొట్టిపారేస్తూ ముందుకు సాగుతూనే ఉన్నాం.

కాలక్రమంలో మనిషి ఎన్నో కొత్త కొత్త విషయాలను కనిపెడుతూ ఉన్నాడు. సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తూనే ఉన్నాడు. కానీ, పుట్టుక ఉన్నట్లే, మరణం కూడా కచ్చితంగా ఉంటుంది కదా..? మనిషి పుట్టుకకు కూడా ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పడాల్సిందే కదా? లేటెస్ట్‌గా వచ్చిన ఓ అధ్యనం మానవ సమాజం అంతం ఖాయమని అంటోంది.

మానవ సమాజం మరో రెండేళ్లలో అంతం అయిపోతుందని, అంతానికి అతి చేరువలో మానవాళి ఉందని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(Massachusetts Institute for Technology (MIT)) చేసిన సంచలన అధ్యయనం చెబుతోంది. పెరుగుతోన్న నాగరికత, సాగుతోన్న జీవన విధానం పరిస్థితులను కఠినతరం చెయ్యబోతున్నాయని, ప్రస్తుతం నడుస్తోన్న నాగరిక విధానాలు, వ్యాపార ఆలోచనలు ఇలాగే కొనసాగితే 2040లోగా ఆర్ధిక వృద్ధి పూర్తిగా ఆగిపోతుందని, తద్వారా మానవ సమాజం అంతమైపోయే ప్రమాదం కూడా ఉందని అధ్యయనం స్పష్టం చేసింది.

ప్రకృతి ఇచ్చే వనరులను అధికంగా దోపిడీ చెయ్యడం.. అవసరానికి మించి ప్రకృతిని వినియోగించుకోవడం వల్ల.. రాబోయేకాలంలో పరిస్థితి మానవాళి చేతుల్లో నుంచి ప్రకృతి చేతుల్లోకి వెళ్లిపోనుందని అథ్యయనం చెబుతుంది. 21శతాబ్ధంలో ఈమేరకు ఎన్నో పరిణామాలను ప్రజలు చూడబోతున్నట్లు చెప్పింది అధ్యయనం. 1972లో అత్యధికంగా అమ్ముడైన “ది లిమిట్స్ టు ఎక్స్‌పాన్షన్” అనే పుస్తకంలో చెప్పిన విషయాలను ప్రస్తావిస్తూ.. MIT శాస్త్రవేత్తలు 12 భవిష్యత్ దృశ్యాలను గురించి వివరించారు.

మానవ సమాజం చివరి దశలో ఉందని, రెండు దశాబ్దాల్లో అది అంతం అయిపోవచ్చునని వెల్లడించింది. రాబోయే 20ఏళ్లలో వచ్చే మార్పులు ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేయవచ్చునని పేర్కొంది. వీటిలో ముఖ్యంగా ఎక్కువ భాగం సహజ వనరులు దుర్వినియోగం గురించి ప్రస్తావించింది అధ్యయనం. అంతేకాదు, రాబోయే కాలంలో ఆర్థిక విస్తరణ అసాధ్యమని, వ్యక్తిగత సంక్షేమం కూడా సాధ్యం కాని పరిస్థితి వస్తుందని అంచనా వేసింది.

అయితే, MIT అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా వివాదాలకు కారణం అవుతోంది. కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం, దీనిని వక్రికరించిన అధ్యయనంగా అబిప్రాయపడుతున్నారు. MIT నిపుణులను ఎగతాళి చేస్తున్నారు. అయితే, గ్లోబల్ సేల్స్ పరంగా ‘బిగ్ ఫోర్’ అకౌంటింగ్ కంపెనీలలో ఒకటైన ప్రొఫెషనల్ సర్వీసెస్ బెహెమోత్ కేపీఎంజీ సీనియర్ డైరెక్టర్ ఈ అధ్యయనానికి సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు