Islamic militants attack 8 civilians killed in Mogadishu hotel
Islamic militants attack 8 civilians killed in Mogadishu hotel : సోమాలియా రాజధాని మొగదిషులోని ఒక హోటల్‌పై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం (20,2022) మొగదిషులోని ఒక హోటల్‌పై అల్ షబాబ్ ఉగ్రవాదులు అటాక్ చేశారు. ఆ ఘటనలో 8 మంది మృతిచెందారు. మారణాయుధాలతో హోటల్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు అక్కడ కొంత మందిని బంధీ చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ఆ హోటల్‌లోకి ప్రవేశించి ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు.
ముష్కరులపై భద్రతా దళాలు పోరాడటంతో ప్రాణనష్టం నియంత్రించబడినట్లుగా తెలుస్తోంది. భద్రతా దళాలు ముష్కరుల బారి నుంచి పలువురుని రక్షించారని భద్రతా దళాల అధికారి మొహమ్మద్ అబ్దికాదిర్ తెలిపారు. కానీ అప్పటికే ముష్కరులు ఎనిమిదిమందిని పొట్టనపెట్టుకున్నారు. మొగధీషులోని హోటల్ హయ్యత్ వద్ద రెండు కారు బాంబు పేలుళ్ల ఘటనలు జరిగాయి. ఆ దాడులకు కూడా అల్ షబాబ్ కారణమని తెలుస్తోంది.