Corona Virus : ఒమిక్రాన్‌‌కు అంత సీన్ లేదంటున్న సౌతాఫ్రికా..!

ఒమిక్రాన్‌తో లక్షణాలు స్వల్పంగా బయటపడుతున్నాయని దక్షిణాఫ్రికా మెడికల్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. దగ్గు, కండరాల నొప్పులు, అలసట తప్ప అంతకు మించి లక్షణాలేవీ ఈ కొత్త వేరియెంట్‌ ద్వారా.

South Africa Omicron : కొత్త వేరియంట్‌ గురించి అంతా హడావుడేనా ? అసలు కొత్త వేరియంట్‌కు అంత సీన్‌ లేదా ? అనవసరంగా హైప్‌ చేసి భయపెడుతున్నారా ? అంటే అవునంటోంది దక్షిణాఫ్రికా..! ఒమిక్రాన్..ఒమిక్రాన్‌..ఒమిక్రాన్‌.. ప్రపంచదేశాల్లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే చర్చ. ఇదే రచ్చ. ఆఫ్రికాదేశాల్లో తొలిసారి బయటపడిన ఈ వేరియంట్‌ గురించి దక్షిణాఫ్రికా ప్రకటించినప్పటి నుంచి ప్రపంచదేశాలు భయం గుప్పిట్లో బతుకుతున్నాయి. అయితే ఈ వేరియంట్‌పై పరిశోధనలు ఇంకా తొలిదశలోనే ఉన్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమని ఇప్పటివరకు ఎలాంటి పరిశోధనలు స్పష్టం చేయలేదు కూడా. ఇదే విషయాన్ని చెబుతోంది దక్షిణాఫ్రికా. ఒమిక్రాన్‌కు అంత సీన్‌ లేదంటోంది. కనిపిస్తోన్న స్వల్ప లక్షణాలకే ఎందుకు బిల్డ్‌ ఆప్‌ ఇస్తున్నారో అర్థంకావడం లేదంటోంది. ఒమిక్రాన్‌ గురించి అనవసరంగా హైప్‌ చేస్తున్నారంటూ మండిపడింది. రెండు మూడు వారలు గడిస్తే కానీ స్పష్టమైన డేటా బయటకు రాదని.. ఇప్పటినుంచే లేనిపోని హడావుడి ఎందుకని ప్రశ్నించింది.

Read More : One Rupee Coin : వేలంలో రూ.2.5 లక్షలకు అమ్ముడుపోయిన రూపాయి నాణెం

ఒమిక్రాన్‌తో లక్షణాలు స్వల్పంగా బయటపడుతున్నాయని దక్షిణాఫ్రికా మెడికల్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. దగ్గు, కండరాల నొప్పులు, అలసట తప్ప అంతకు మించి లక్షణాలేవీ ఈ కొత్త వేరియెంట్‌ ద్వారా బయటపడలేదని తెలిపింది. ఒమిక్రాన్‌ కారణంగా ఆస్పత్రులపై భారం పడడం లేదని క్లారిటీ ఇచ్చింది. 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు, వ్యాక్సిన్‌ తీసుకోని వారే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని చెప్పింది. వ్యాక్సిన్‌ తీసుకున్న వాళ్లు ఈ వేరియెంట్‌ కారణంగా ఆస్పత్రిలో చేరలేదని స్పష్టం చేసింది. ఎంత ప్రమాదకరమో అవగాహన రావాలంటే మరో 15 రోజులు పడుతుందని వివరించింది. ఇక ప్రపంచ దేశాలు తమపై ప్రయాణ ఆంక్షలు విధించడాన్ని దక్షిణాఫ్రికా తీవ్రంగా ఆక్షేపించింది. ముందుగానే ప్రపంచాన్ని హెచ్చరించినందుకు తాము శిక్ష అనుభవిస్తున్నామని వాపోయింది. ఇది తప్పుడు నిర్ణయమని, WHO నియమావళికి విరుద్ధమని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి వ్యాఖ్యానించారు. ప్రపంచ సమస్యను కలిసి పరిష్కరించాల్సిన సమయంలో కొన్ని దేశాలు బలిపశువులను వెతుకుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాస్త్రీయపరమైన ఆధారాలను చూడకుండా విధిస్తున్న ఈ ఆంక్షలు క్రూరమైనవని అభిప్రాయపడ్డారు. ఇతరులను నిందించకుండా కరోనాపై అన్నిదేశాలు ఉమ్మడి పోరు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు