COVID Positive : కోవిడ్ వచ్చినా.. ఐసోలేషన్ అవసరం లేదు

కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి లక్షణాలు లేకుంటే అసలు ఐసోలేషన్ అవసరమే లేదని ప్రకటించింది. స్కూళ్లలో భౌతిక దూరం ఉండాలనే నిబంధన కూడా ఎత్తివేసింది.

South Africa COVID : ప్రపంచాన్ని ఇంకా కరోనా భయపెడుతోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ అన్ని దేశాలకు వ్యాపించింది. ఈ వైరస్ తో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గడగడలాడిస్తోంది. వైరస్ సోకకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు పలు నిబంధనలు విధిస్తున్న సంగతి తెలిసిందే. శానిటేజషన్, భౌతిక దూరం తో పాటు మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని ఆంక్షలు విధిస్తున్నాయి. అదేవిధంగా కోవిడ్ సోకిన వారు తప్పనిసరిగా హోమ్ ఐసోలేషన్ లో ఉండాలనే నిబంధన ఉంది. అయితే… దక్షిణాఫ్రికాలో వైరస్ ఉధృతి తగ్గుముఖం తగ్గుముఖం పడుతుండడంతో ఆంక్షలను సడలిస్తున్నట్లు దక్షిణాఫ్రికా ప్రభుత్వం వెల్లడించింది.

Read More : Aishwaryaa : ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య కరోనాతో హాస్పిటల్‌లో

కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి లక్షణాలు లేకుంటే అసలు ఐసోలేషన్ అవసరమే లేదని ప్రకటించింది. స్కూళ్లలో భౌతిక దూరం ఉండాలనే నిబంధన కూడా ఎత్తివేసింది. టెస్టులు చేయించుకున్న తర్వాత లక్షణాలు కనిపిస్తే మాత్రం ఏడు రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలని పేర్కొంది. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తులకు సన్నిహితంగా మెలిగిన వారిలో లక్షణాలు లేకుంటే వారు కూడా ఐసోలేషన్ లో ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. 60 నుంచి 80 శాతం ప్రజల్లో కోవిడ్ ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి ఉన్నట్లు సర్వేల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

ట్రెండింగ్ వార్తలు