South Korea Covid : దక్షిణ కొరియాలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 6 లక్షల కొత్త కేసులు..!

South Korea Covid : దక్షిణ కొరియాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఒక్కరోజులోనే కరోనా కొత్త కేసులు 6లక్షల వరకు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు నమోదైన రోజువారీ కేసుల్లో ఇదే అత్యధికం.

South Korea Covid : దక్షిణ కొరియాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఒక్కరోజులోనే కరోనా కొత్త కేసులు 6లక్షల వరకు నమోదయ్యాయి. ఇప్పటికే సౌత్ కొరియాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు విజృంభిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. కరోనా కొత్త కేసులు, మరణాలు తగ్గాయని అనుకున్న కొద్ది రోజుల్లోనే కరోనా కేసులు మళ్లీ తిరగబెట్టాయి. ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ల మధ్య దక్షిణ కొరియాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. దక్షిణ కొరియాలో గురువారం నాటికి 6లక్షల కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు నమోదైన రోజువారీ కరోనా కేసుల్లో ఇదే అత్యధికం. కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ గురువారం దక్షిణ కొరియాలో రికార్డు స్థాయిలో 6,21,328 కొత్త రోజువారీ కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది.

ఇక కరోనా రోజువారీగా 429 మరణాలు నమోదయ్యాయి. తాజా లెక్కల ప్రకారం.. కేవలం ఒక్క రోజులో 55 శాతం పెరిగినట్టు కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ (KDCA) వెల్లడించింది. కొత్త కేసులతో దక్షిణ కొరియా మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,250,592కి పెరిగిందని KDCA తెలిపింది. దేశంలో ఊహించిన దానికంటే రోజువారీ కరోనా కేసులు భారీగా నమోదయ్యాయని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. ఈ కరోనా కేసుల్లో చాలా వరకు స్థానికంగా వ్యాపించినవే ఉన్నాయని తెలిపారు. దక్షిణ కొరియాలో మొన్నటివరకూ 4 లక్షల మధ్య రోజువారీ కేసులు నమోదు కాగా.. తాజాగా కొత్త కరోనా కేసులతో 6 లక్షలు దాటేశాయి. నివేదికల ప్రకారం.. దక్షిణ కొరియాలో గడిచిన 24 గంటల్లో 293 కరోనా మరణాలు నమోదయ్యాయి. నెల క్రితం గరిష్ట స్థాయిలో పెరిగిన కరోనా కేసులు.. మార్చి మధ్యలో 140,000-270,000 రోజువారీ కేసులు పెరుగుతాయని KDCA అంచనా వేసింది. 

South Korea Covid South Korea Records Highest Daily Spike In Covid Cases With 6 Lakh New Infectionsఅంతకుముందు దక్షిణకొరియాలో బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఏకంగా 4లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియా ప్రభుత్వం గణాంకాల ప్రకారం.. బుధవారం 4,00,714 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 76లక్షల 29వేల 275కు చేరినట్లు KDCA స్పష్టం చేసింది.

కరోనా ఆంక్షలు సడలింపు :
ఒమిక్రాన్‌ వేరియంట్‌, కరోనా ఆంక్షల సడలింపు కారణంగానే కరోనా కేసులు పెరగడానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. వైరస్‌ తీవ్రత పెరుగుతున్న క్రమంలో దేశంలో మళ్లీ కఠిన ఆంక్షలు విధించే అవకాశాలు కనిపించడం లేదు. ఇదివరకే విధించిన ఆంక్షలనే సడలించాలని కొరియా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా కేసులు తగ్గినట్టు కనిపించడంతో కర్ఫ్యూను రాత్రి 11 గంటలకు తగ్గించింది. ఇప్పటికే వ్యాక్సిన్ పాస్‌లను కూడా ఆపివేసింది. విదేశాల నుంచే వచ్చేవారికి క్వారంటైన్ కూడా ఎత్తివేయాలనే యోచనలో ఉంది. అయితే, ప్రైవేట్ సమావేశాలపై ప్రస్తుత ఆరుగురు వ్యక్తుల పరిమితిని సడలించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు.. దక్షిణ కొరియా అన్ని పబ్లిక్ ఇండోర్, అవుట్‌డోర్ ప్రదేశాలలో మాస్క్‌లను తప్పనిసరి చేసింది.

Read Also : South Korea Corona : ఒక్కరోజే 4లక్షలకు పైగా కరోనా కేసులు.. దక్షిణ కొరియాలో కోవిడ్ కల్లోలం

ట్రెండింగ్ వార్తలు