South Korea Corona : ఒక్కరోజే 4లక్షలకు పైగా కరోనా కేసులు.. దక్షిణ కొరియాలో కోవిడ్ కల్లోలం

తగ్గినట్లే తగ్గిన కరోనా.. మళ్లీ విజృంభిస్తోంది. దక్షిణ కొరియానూ(South Korea Corona) వైరస్‌ వణికిస్తోంది. ఒక్కరోజే 4లక్షలకు పైగా కేసులు వెలుగుచూశాయి.

South Korea Corona : ఒక్కరోజే 4లక్షలకు పైగా కరోనా కేసులు.. దక్షిణ కొరియాలో కోవిడ్ కల్లోలం

South Korea Covid (2)

South Korea Corona : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టింది. కొన్ని రోజులుగా కోవిడ్ ఉధృతి తగ్గింది. కొత్త కేసులు, మరణాలు గణనీయంగా తగ్గాయి. దీంతో యావత్ ప్రపంచం ఊపిరిపీల్చుకుంది. హమ్మయ్య.. ఇక కరోనా పీడ విరగడ అయినట్టే అని జనాలు రిలాక్స్ అవుతున్నారు. ఇంతలోనే మళ్లీ కరోనా మహమ్మారి కల్లోలం మొదలైంది. తగ్గినట్లే తగ్గిన కరోనా.. మళ్లీ విజృంభిస్తోంది. భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే చైనాలో కరోనా పంజా విసురుతోంది. కొవిడ్‌ పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో ఎప్పుడూ లేనన్ని కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు దక్షిణ కొరియానూ వైరస్‌ వణికిస్తోంది.

China Covid 4th Wave : చైనాలో కరోనా విజృంభణ.. 2ఏళ్ల రికార్డు బ్రేక్.. ఒక్కరోజే భారీగా కేసులు

కరోనా మహమ్మారి దక్షిణకొరియాను వణికిస్తోంది. బుధవారం ఒక్కరోజే అక్కడ రికార్డు స్థాయిలో కేసులు బయటపడ్డాయి. ఏకంగా 4లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగుచూశాయి. దక్షిణ కొరియా ప్రభుత్వ మీడియా వివరాల ప్రకారం.. బుధవారం 4,00,714 మందికి పాజిటివ్‌గా తేలింది. ఆ దేశంలో కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇవే అత్యధిక కేసులు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 76లక్షల 29వేల 275కు చేరినట్లు కొరియా వ్యాధి నియంత్రణ, నివారణ ఏజెన్సీ స్పష్టం చేసింది. గత 24 గంటల్లో 293 మంది కోవిడ్ తో మృతి చెందారు.(South Korea Corona)

Covid New Variant: ఇజ్రాయెల్ లో బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్

‘స్టెల్త్‌ ఒమిక్రాన్‌’ రూపంలో కొవిడ్‌ మహమ్మారి చైనాను మళ్లీ వణికిస్తోంది. రెండేళ్ల తర్వాత తొలిసారి.. చైనాలో మంగళవారం అత్యధికంగా 5,280 కొత్త కేసులు నమోదయ్యాయి. ముందురోజు కంటే కేసులు రెట్టింపయ్యాయి. కొత్త కేసు ఒక్కటీ రాకూడదన్న(జీరో-టాలరెన్స్‌) వ్యూహంతో.. రెండేళ్లకు పైగా కొవిడ్‌ను కట్టడి చేస్తూ వస్తోన్న డ్రాగన్‌కు ఈ వేరియంట్‌ దడ పుట్టిస్తోంది. వరుసగా ఆరో రోజు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటంతో చైనా 13 పెద్ద నగరాలను మూసివేసింది. 3 కోట్ల మందికి పైగా ప్రజలను లాక్‌డౌన్ లో ఉంచింది. ప్రజారవాణాను నిలిపివేసింది. పలు నగరాల్లో ఆంక్షలు విధించింది.

COVID Surges : కరోనా ఉధృతి.. లాక్ డౌన్‌‌లో 3 కోట్ల మంది

మళ్లీ వైరస్‌ విజృంభిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉందని, స్వల్ప విరామం తర్వాత వైరస్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా కరోనా నిబంధనలు తొలగించిన ప్రాంతాల్లో వైరస్ తిరగబడుతోందని హెచ్చరించింది. చైనా సహా కొన్ని దేశాల్లో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోన్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ ఎపిడెమిలాజిస్ట్‌ మరియా వాన్‌ ఖెర్ఖోవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మనమంతా అప్రమత్తంగా ఉండాలని.. టెస్టులు, జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లు, వ్యాక్సినేషన్‌ను మరింత పెంచాలని సూచించారు.

China Lockdown: కొత్త వేరియంట్ లేదు అయినా చైనాలో లాక్ డౌన్? ఎందుకు?