China Covid 4th Wave : చైనాలో కరోనా విజృంభణ.. 2ఏళ్ల రికార్డు బ్రేక్.. ఒక్కరోజే భారీగా కేసులు

China Covid 4th Wave : చైనాలో కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతోంది. కరోనా కొత్త కేసులు పెరిగిపోవడంతో పలు నగరాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు.

China Covid 4th Wave : చైనాలో కరోనా విజృంభణ.. 2ఏళ్ల రికార్డు బ్రేక్.. ఒక్కరోజే భారీగా కేసులు

Covid 4th Wave New Cases In China Breaks 2 Year Record As More Than 3300 People Infected

China Covid 4th Wave : చైనాలో కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతోంది. కరోనా కొత్త కేసులు పెరిగిపోవడంతో పలు నగరాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు. ప్రపంచమంతా కరోనా తగ్గిపోయిందిలే అనుకున్న తరుణంలో మళ్లీ చైనాలో కరోనా తిరగబెడుతోంది. ఇప్పటికే చైనాలో కరోనా పరిస్థితులు తగ్గుముఖం పుట్టాయని ఊపిరిపీల్చుకున్న ప్రజల్లో ఆందోళన మొదలైంది. కరోనా పుట్టినిల్లు చైనాలో  రోనా పరిస్థితులు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. 2020 మార్చి తర్వాత రికార్డు స్థాయిలో చైనాలో రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు నగరాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగాయి. దాంతో ఆయా నగరాల్లో కఠిన ఆంక్షలను విధించడంతో పాటు లాక్‌డౌన్‌ విధించారు చైనా అధికారులు. సోమవారం ఒక్కరోజే 2,300 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక రోజు ముందు 3,400 కరోనా కేసులు నమోదయ్యాయి. రెండేళ్లలో రోజువారీ కేసుల్లో ఇదే అత్యధికంగా చెప్పవచ్చు.

దక్షిణ చైనాలో టెక్ హబ్‌గా పేరొందిన షెన్‌జెన్‌ నగరంలో ఒకే రోజు 66 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వెంటనే అప్రమత్తమైన నగర అధికారులు కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు వెల్లడించారు. షెన్‌జెన్‌ సిటీలో 1 కోటి 75 లక్షల మంది జనాభా ఉన్నారు. కరోనా కేసుల తీవ్రత మరింత పెరిగితే పరిస్థితి ఏంటి అనేది అధికారుల్లో టెన్షన్‌ నెలకొంది. నగర వాసులు ఎవరూ కూడా తమ ఇళ్లను వదిలి బయటకు రావద్దని అధికారులు ఆదేశించారు. ఏదైనా అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే నగర వీధుల్లో రావాలని అధికారులు సూచించారు. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే.. 24గంటల్లోగా కరోనా టెస్టు చేయించుకుని ఉండాలి. అందులో నెగటివ్ రిపోర్టు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.

Covid 4th Wave New Cases In China Breaks 2 Year Record As More Than 3300 People Infected

Covid 4th Wave New Cases In China Breaks 2 Year Record As More Than 3300 People Infected

ఫాక్స్‌కాన్‌, హువావే, టెన్‌‌సెంట్‌ కంపెనీల మెయిన్ ఆఫీసులు సైతం ఈ నగర షెన్‌జెన్‌లోనే ఉన్నాయి. ఆపిల్‌కు సప్లయర్‌ ఫాక్స్‌కాన్‌ కూడా తన కార్యకలాపాలను ఆపేసింది. షెన్‌జెన్‌ సమీపంలోని అన్ని ఫ్యాక్టరీలు, స్మాల్‌ స్కే్ల్‌ క్లస్టర్లు ఎక్కువగా ఉన్నాయి. కమ్యూనిటీ స్ర్పెడ్‌ వేగంగా ఉండొచ్చువని అధికారులు చెబుతున్నారు. ఫాక్స్‌కాన్‌, హువావే, టెన్‌ సెంట్‌ వంటి ప్రముఖ కంపెనీల ప్రధాన కార్యాలయాలు షెన్‌జెన్‌లోనే ఉన్నాయి. ఆపిల్‌కు సప్లయర్‌ ఫాక్స్‌కాన్‌ కూడా కార్యకలాపాలను నిలిపివేసింది. షెన్‌జెన్‌ సిటీ హంకాంగ్‌సరిహద్దుకు దగ్గరగా ఉంది. చైనాలో 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌, డెల్టా వేరియంట్ల విజృంభిస్తున్నయాని అధికారులు తెలిపారు.

Read Also : China Lockdown : కరోనా ఎఫెక్ట్.. చైనాలో మళ్లీ లాక్ డౌన్..!