China Lockdown: కొత్త వేరియంట్ లేదు అయినా చైనాలో లాక్ డౌన్? ఎందుకు?

చైనా మాత్రం మరోసారి పకడ్బందీగా లాక్ డౌన్ విధించడం చర్చనీయాంశంగా మారింది. కోటి డెబ్భై లక్షలకు పైగా జనాభా ఉన్న నగరంలో గత శుక్రవారం నుంచి పకడ్బందీ లాక్ డౌన్ విధించారు

China Lockdown: కొత్త వేరియంట్ లేదు అయినా చైనాలో లాక్ డౌన్? ఎందుకు?

China

China Lockdown: కరోనా ముగిసిపోయిందంటూ ఓవైపు ప్రపంచ దేశాలు ఆంక్షలు సడలిస్తూ, తమ నగరాల్లో సాధారణ స్థితి నెలకొల్పేలా చర్యలు తీసుకుంటుంటే.. చైనా మాత్రం మరోసారి పకడ్బందీగా లాక్ డౌన్ విధించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో చైనాలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసుల పెరుగుదల కనిపించింది. మధ్య చైనా సహా షాంఘై చుట్టుప్రక్కల ప్రాంతాల్లోనూ కరోనా కొత్త కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఇక పారిశ్రామిక నగరమైన చాంగ్‌చున్ లో గత వారంలో రోజువారి కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో కోటి డెబ్భై లక్షలకు పైగా జనాభా ఉన్న ఆ నగరంలో గత శుక్రవారం నుంచి పకడ్బందీ లాక్ డౌన్ విధించారు అధికారులు. ప్రజలు ఎవరు బయటకు రాకూడదని హెచ్చరించిన అధికారులు, నిత్యావసరాలు సహా ఇతర ఏ అవసరాలైనా ప్రభుత్వమే ఇంటింటికీ పంపేలా ఏర్పాట్లు చేస్తినట్లు తెలిపారు. ఉన్నట్టుండి చైనాలో మరోసారి లాక్ డౌన్ విధించడంతో అంతర్జాతీయంగా మరోసారి కరోనా వ్యాప్తిపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Also Read: Covid Vaccine Children : మార్చి16 నుండి 12-15 ఏళ్ళ పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్

కరోనా పుట్టినిల్లుగా చెప్పుకుంటున్న చైనాలో మరోసారి కరోనా వైరస్ విజృంభించడం, లాక్ డౌన్ విధించడంతో.. మరో కొత్త వేరియంట్ ఏదైనా వ్యాప్తిలోకి వచ్చిందేమోనన్న ఊహాగానాలు వ్యక్తం అయ్యాయి. 2019 – 20 తరువాత చైనాలో మరోసారి గరిష్ట సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన వైద్యశాఖ అధికారులు కఠిన లాక్ డౌన్ విధిస్తు..కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి.. కేసుల కాంటాక్టులను ట్రేస్ చేస్తున్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నియమాలను తప్పనిసరి చేశారు అక్కడి అధికారులు. అయితే మిగతా ప్రపంచ దేశాలతో పోల్చితే చైనాలో ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇది మరో మహమ్మారిగా అవతరించే అవకాశం ఉందా అనే కోణంలో ఇతర దేశాలూ సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.

Also read: Russia Ukraine War : టెక్ దిగ్గజాలకు రష్యా షాక్.. విమర్శలు చేస్తే అరెస్ట్ చేస్తామంటూ హెచ్చరిక..!

కాగా, చైనాలో మరోసారి కరోనా వ్యాప్తి గురించి భయపడాల్సిన పనిలేదని కొన్ని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు వివరించాయి. ప్రస్తుతం చైనాలో నమోదు అవుతున్న కొత్త కరోనా కేసుల్లో ఓమిక్రాన్ డెల్టా వేరియంట్ బాధితులే ఉన్నారని, కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్లుగా ఎక్కడా సమాచారం లేదని ఆయా ఆరోగ్య సంస్థలు పేర్కొన్నాయి. అయితే కరోనా పై “జీరో టాలరెన్స్” వ్యూహంతో ముందుకెళ్తున్న చైనా..అందులో భాగంగానే.. ఇలా లాక్ డౌన్ విధించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. “జీరో టాలరెన్స్”లో భాగంగా ఏ ఒక్క కరోనా కేసు నమోదు అయినా చైనా ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుందని అందుకే ప్రస్తుత లాక్ డౌన్ పై ఇంత ప్రచారం జరుగుతున్నట్టు ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. ఇటీవల వింటర్ ఒలింపిక్స్ కు చైనా ఆతిధ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్ కారణంగానే ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నట్టు అక్కడి అధికారులు భావిస్తున్నారు.

Also read: UK ‘Homes for Ukraine’:యుక్రెయిన్ ప్రజలకు ఆశ్రయం ఇస్తే బహుమతి..ఒక్కో శరణార్థికి 456 డాలర్లు: బ్రిటన్ ప్రకటన