South Korea : ‘కవ్విస్తే కట్ చేస్తాం’ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌కే వార్నింగ్ ఇచ్చిన దక్షిణకొరియా కొత్త అధ్యక్షుడు

‘కవ్విస్తే కట్ చేస్తాం’ ‘మొరటుబాలుడు కిమ్ కు మర్యాదలు నేర్పిస్తా అంటూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌కే వార్నింగ్ ఇచ్చారు దక్షిణకొరియా కొత్త అధ్యక్షుడు.

South Korea new president Yoon Suk Yeol Warn to North Korea Kim Jong Un : నార్త్ కొరియా నరకాసురుడుగా పేరొందిని అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పేరు చెబితే ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. సొంత దేశ ప్రజలకే యమకింకరుడు కిమ్. అధ్యక్షుడు కిమ్ ఓ ఆర్డర్ పాస్ చేశాడు అంటే అది వీసమెత్తు కూడా పొల్లు పోకుండా అమలు జరగాల్సిందే. లేదంటే చావు ఖాయం.అది ప్రజలకైనా అంతే అధికారులకైనా అంతే. కిమ్ యాక్షన్ కు రియాక్షన వస్తే వారిగతి అంతే. తన ఆజ్ఞలు పాటించకపోతే వారిని ఖతం చేయటానికి కూడా వెనుకాడని అత్యంత క్రూరుడు కిమ్.

Also read : Russia Ukraine war: రష్యా యుక్రెయిన్ యుద్ధం వలన ఎంత నష్టం జరిగిందంటే!

అటువంటి నార్త్ కొరియా నరకాసురుడు కిమ్ జాంగ్ కే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు యూన్‌ సుక్‌. సరిహద్దు దేశంగా ఉన్న తమను ‘కవ్విస్తే కట్ చేస్తాం’అంటూ వార్నింగ్ ఇచ్చార యూన్ సుక్. ఇటీవల దక్షిణ కొరియాలో అధ్యక్షుడి ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఈ ఎన్నికల్లో గట్టి పోటీ తరువాత సౌత్‌ కొరియాకు పీపుల్‌ పవర్‌ పార్టీ అభ‍్యర్థి యూన్‌ సుక్‌ యోల్‌ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ పోరులో అధికార డెమొక్రటిక్​ పార్టీ అభ్యర్థి లీ జే-మ్యూంగ్​ ఓటమిని అంగీకరించారు. యూన్ సుక్ 61 ఏళ్ల లీ జే-మ్యూంగ్‌ను ఓడించి స్వల్ప తేడాతో గెలుపొందారు.

See also : https://10tv.in/web-stories/north-koreastormy-cheers-kim-jong-un-celebrates-fathers-birthday

ఈ సందర్భంగా యూన్‌ సుక్‌ యోల్ మాట్లాడుతూ..వచ్చే మే నెలలో తాను పదవీ బాధ్యతలు చేపడతాను అని వెల్లడించారు. అనంతరం తన విదేశాంగ విధానం గురించి వెల్లడిస్తూ అమెరికాతో సంబంధాలను మరింత పటిష్టం చేసుకోనున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ‍్యలు చేశారు. కిమ్ కే థమ్కీ ఇచ్చాకు దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు యూన్ సుక్.

Also read : North Korea: పువ్వులు పూయించలేదని తోటమాలీలను జైల్లో పెట్టిన కిమ్

‘‘నార్త్ కొరియా ఉత్తర కొరియా కవ్వింపులకు పాల్పడితే ఏమాత్రం సహించేది లేదని వారి దుశ్చర్యలను సమర్థంగా ఎదుర్కొంటామని కిమ్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. అంతేకాదు కిమ్ పై సెటైర్లు కూడా వేశారు యూన్ సుక్ నార్త్ కొరియా ప్రెసిడెంట్ ఓ ‘మొరటు బాలుడు..అతనికి మర్యాదలు నేర్పించాలనుకుంటున్నా..అని అన్నారు. ప్రజల భద్రత, దేశ సార్వభౌమాధికార రక్షణ కోసం శక్తిమంతమైన సైన్యాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో యూన్ మాట్లాడుతూ..‘మీరు (ప్రజలను ఉద్ధేశించి)నాకు ఒక అవకాశం ఇస్తే నార్త్ కొరియా ‘మొరటు బాలుడు’’కు మర్యాదలు నేర్పాలనుకుంటున్నా’అని అన్నారు.

Also read : Stormy Cheers: నార్త్‌ కొరియా కిమ్ శాడిజం.. మైనస్‌ 15 డిగ్రీల ఉష్టోగ్రతలో!

అలాగే ప్రస్తుత అధ్యక్షుడు మూన్​ జే-ఇన్​పై షాకింగ్‌ ఆరోపణలు చేశారు. చైనా, ఉత్తర కొరియావైపు మూన్​ జే ఇన్​ మొగ్గు చూపుతున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల్లో విజయం సాధించిన సుక్​ యోల్..​ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు వైట్‌ హౌస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సుక్​యోల్​కు బైడెన్‌ శుభాకాంక్షలు చెప్పినట్టు తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు