Hungry Student : ఆకలేసిందట.. మ్యూజియంలో 98 లక్షల విలువ చేసే అరటిపండు కళాఖండాన్ని తినేసిన స్టూడెంట్.. ఇదేం విడ్డూరం?

ఆకలేసిందని ఓ విద్యార్ధి మ్యూజియంలోని అరటిపండు కళాకండాన్ని తినేశాడు. తొక్కని మాత్రం భద్రంగా గోడకి తగిలించాడు. ఆ కళాఖండం ధర కేవలం 98 లక్షల రూపాయలట.. విడ్డూరంగా ఉందా.. చదవండి.

 Hungry Student

Hungry Student :  ఆకలేస్తే ఫుడ్ తినాలి కానీ.. మ్యూజియంలో ఉన్న కళాఖండాలు తినడం ఏంటి? అదీ మ్యూజియంలో గోడకు ఉన్న అరటిపండు కళాఖండం.. అదేమో ఆషామాషీ కళాఖండం కాదు. దాని విలువ 98 లక్షలట. బాప్ రే.. అనుకుంటున్నారు కదా.

Gandhi Museum In America : అమెరికాలో భారత జాతిపితకు అరుదైన గౌరవం.. న్యూజెర్సీలో మహాత్మాగాంధీ మ్యూజియం

దక్షిణ కొరియా స్టూడెంట్ నోహ్ సియోల్‌లోని లీయం మ్యూజియంకు వచ్చాడు. బ్రేక్ ఫాస్ట్ చేయలేదట పాపం.. గోడకు అంటించి ఉన్న అరటిపండు తినేసాడు. తిని ఎంతో శ్రద్ధగా దాని తొక్కను తిరిగి గోడకు అంటించాడు. మారిజయో కాటెలన్ అనే కళాకారుడు ఈ అరటిపండు(Banana)ను ప్రదర్శనలో ఉంచాడట. మోహ్ అరటిపండు తినడం అతని స్నేహితుడు వీడియో తీసాడు. అతను అరటిపండు తినడం ప్రారంభించగానే మ్యూజియంలో ఉన్న వారంతా నిశ్శబ్దంగా వెళ్లిపోయారట. అరటిపండు తొక్క గోడకు తగిలించి దానికి కూడా మోహ్ ఫోజులు ఇచ్చాడు.

ఆ తరువాత అతనిని ప్రశ్నించిన మీడియాతో పాడు చేయడం కూడా ఒక ఆర్ట్ అని .. ఇది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని తాను అనుకున్నానని  చెప్పాడట. ఇక ఈ కళాఖండాన్ని తయారు చేసిన వ్యక్తికి విషయం చెబితే అతను కూడా లైట్ తీసుకున్నాడట. ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించే అరటపండును ప్రతి రెండు మూడు రోజులకు మారుస్తారట.

Britain : పాలన పేరుతో ప్రపంచాన్ని దోచేసిన ఆంగ్లేయులు .. బ్రిటీష్ మ్యూజియంలో మూలుగుతున్న భారత్ అత్యంత విలువైన సంపద

అయితే కాటెలన్ కళాఖండాన్ని విజిటర్లు తినడం ఇది మొదటిసారి కాదట. 2019లో కూడా మయామి ఆర్ట్ బాసెల్‌లో ప్రదర్శనకు ఉంచినపుడు డేవిడ్ డాటునా అనే వ్యక్తి అరటిపండును తిన్నాడట. విషయం ఏంటంటే కాటెలన్ కళాఖండం అరటిపండును తినడానికి చాలామంది పోటీ పడుతున్నారన్నమాట.

ట్రెండింగ్ వార్తలు