Gandhi Museum In America : అమెరికాలో భారత జాతిపితకు అరుదైన గౌరవం.. న్యూజెర్సీలో మహాత్మాగాంధీ మ్యూజియం
భారత జాతిపిత మహాత్మాగాంధీకి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. న్యూజెర్సీలో మహాత్మాగాంధీ మ్యూజియం ఏర్పాటు చేశారు. గాంధీ జీవిత విశేషాలు, జాతికి ఆయనిచ్చిన సందేశాలతో కూడిన మ్యూజియం ప్రారంభమైంది.

Gandhi Museum
Gandhi Museum In America : భారత జాతిపిత మహాత్మాగాంధీకి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. న్యూజెర్సీలో మహాత్మాగాంధీ మ్యూజియం ఏర్పాటు చేశారు. గాంధీ జీవిత విశేషాలు, జాతికి ఆయనిచ్చిన సందేశాలతో కూడిన మ్యూజియం ప్రారంభమైంది. న్యూజెర్సీలోని అట్లాంటిక్ నగరంలో దీన్ని గతవారం ప్రారంభించారు.
Elephant Eating Panipuri: పానీపూరిని తెగ లాగించేసిన ఏనుగు.. వీడియో వైరల్.. ఫిదా అవుతున్న నెటిజన్లు
ఇందులో ఏర్పాటు చేసిన కళాఖండాలు, డిజిటల్ డిస్‌ప్లేల ద్వారా గాంధీ జీవిత సంఘటనలను ప్రత్యక్ష అనుభూతితో తెలుసుకోవచ్చు. ఈ మ్యూజియాన్ని ఆదిత్య బిర్లా గ్రూప్ భాగస్వామ్యంతో న్యూజెర్సీ గాంధీయన్ సొసైటీ నిర్మించింది. యూఎస్‌లో గాంధీజీకి అంకితం చేసిన మొదటి మ్యూజియం ఇదే కావడం గమనార్హం.