Southwestern Burkina : గోల్డ్ మైనింగ్‌లో వరుస పేలుళ్లు.. 59మంది దుర్మరణం

పశ్చిమ ఆఫ్రికాలోని గోల్డ్ మైనింగ్ ప్రాంతంలో వరుస పేలుళ్లు సంభవించాయి. బుర్కినా ఫాసోలోని బంగారు గనిలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది.

Burkina Faso : పశ్చిమ ఆఫ్రికాలోని గోల్డ్ మైనింగ్ ప్రాంతంలో వరుస పేలుళ్లు సంభవించాయి. బుర్కినా ఫాసోలోని బంగారు గనిలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 59 మంది ప్రాణాలు దుర్మరణం పాలయ్యారు. మరో 100మందికి పైగా గాయపడ్డారు. వీరిలో చాలామంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. బంగారు గనిలో బంగారాన్ని తవ్వి తీస్తున్న క్రమంలో రసాయనాల విచ్ఛిన్నం కావడంతో ఈ పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది.

Gbomblora గ్రామంలో జరిగిన పేలుడు తర్వాత ప్రాంతీయ అధికారులు అక్కడి ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారని నివేదించింది. పేలుడు సమయంలో అదే ప్రాంతంలో ఉన్న ఫారెస్ట్ రేంజర్ సన్సన్ కంబూ ఫోన్ ద్వారా స్పందించారు. మధ్యాహ్నం 2 గంటలకు మొదటి పేలుడు సంభవించిందని తెలిపారు. అలాగే అక్కడి ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారని, అదే సమయంలో మరిన్ని పేలుళ్లు సంభవించాయని ఆయన చెప్పారు.

Explosion Reportedly Kills 59 Near Burkina Faso Gold Mine

బుర్కినా ఫాసో ఆర్థిక వ్యవస్థకు బంగారం ప్రధాన ఆధారంగా మారింది. అధిక బంగారం ఎగుమతుల జాబితాలో ఈ ప్రాంతం అగ్రస్థానంలో ఉంది. ఆఫ్రికాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న బంగారు ఉత్పత్తిదారుగా అభివృద్ధి చెందింది. 2019లో దాదాపు 2 బిలియన్ల డాలర్ల విలువ కలిగిన ఈ పరిశ్రమలో దాదాపు 1.5 మిలియన్ల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Gbomblora వంటి చిన్న బంగారు గనులు ఇటీవలి సంవత్సరాలలో భారీగా పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా దాదాపు 800 వరకు బంగారు గనులు ఉన్నాయి. దక్షిణాఫ్రికాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెక్యూరిటీ స్టడీస్ ప్రకారం.. చాలా బంగారం పొరుగున ఉన్న టోగో, బెనిన్, నైజర్, ఘనాకు అక్రమంగా రవాణా చేస్తున్నారు.

2016 నుంచి దేశంలో దాడులకు పాల్పడిన అల్-ఖైదా, ISIL (ISIS)తో సంబంధం ఉన్న సాయుధ గ్రూపులు కూడా చిన్న తరహా గనులను వినియోగించినట్టు నివేదికలు వెల్లడించాయి. గ్రూపు మైనర్లపై పన్ను విధించడం ద్వారా నిధులను సేకరించాయి. చిన్న గనులు పారిశ్రామిక వాటి కంటే తక్కువ నిబంధనలను కలిగి ఉన్నాయని, తద్వారా మరింత ప్రమాదకరమని మైనింగ్ నిపుణులు అంటున్నారు. పేలుడు పదార్ధాల వాడకంతో సహా దేశంలోకి తరచుగా చట్టవిరుద్ధంగా అక్రమంగా రవాణా జరగడం కూడా ఇలాంటి ప్రమాదాలకు కారణమని గ్లోబల్ ఇనిషియేటివ్ సీనియర్ విశ్లేషకుడు మార్సెనా హంటర్ అన్నారు.

Read Also : Himachal Pradesh : పటాకుల ఫ్యాక్టరీలో పేలుళ్లు..ఏడుగురు దుర్మరణం..

ట్రెండింగ్ వార్తలు