దశాబ్దాల కాలంలో ఎప్పుడూ చూడని పరిస్థితి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తుంది. కరోనా దెబ్బకు మృత్యువు ఒడిలోకి వెళ్తున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలోనే లేటెస్టుగా రెండు ప్రపంచ యుద్ధాలను చూసిన, ప్రపంచ యుద్ధాల్లో పాల్గొన్న 108ఏళ్ల యోధురాలు హిల్డా చర్చిల్ కరోనా కారణంగా చనిపోయింది.
20వ శతాబ్దంలో ప్రపంచాన్ని వణికించిన ‘స్పానిష్ ఫ్లూ’ని తట్టుకుని నిలబడిన ఆమె.. కరోనాతో పోరాడి.. ఓడిపోయింది. బ్రిటన్‌లో కరోనా వైర్‌స్ దెబ్బకు బలైన అత్యంత వృద్ధురాలిగా ఆమె నిలిచారు. హిల్డా చర్చిల్.. మరో వారం రోజుల్లో తన 109వ పుట్టినరోజును జరుపుకొనేందుకు సిద్ధమవుతుండగా కరోనా బారినపడి ఆదివారం కన్నుమూసింది.
1918లో ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మందిని బలితీసుకున్న ‘స్పానిష్ ఫ్లూ’ని ఆమె తట్టుకుని నిలబడ్డారు. అయితే కరోనా నుంచి మాత్రం తప్పించుకోలేక పోయారు.