మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసినట్లేనా? ప్రపంచం ఇక రోజులు లెక్క పెట్టాల్సిందేనా?

మూడో దేశం వస్తే మూడో ప్రపంచ యుద్ధమే అనే చర్చ జరుగుతున్న వేళ.. ఉత్తర కొరియా వ్యవహారం వరల్డ్ వార్ భయాలను మరింత పెంచుతోంది.

Third World War : విధ్వంసం, విలయం, విషాదం.. చరిత్ర పేజీలు దాటొచ్చి చూస్తే యుద్ధం మిగిల్చింది ఇదే. ఇప్పుడు మళ్లీ ప్రపంచాన్ని అవి భయపెట్టబోతున్నాయా? ప్రపంచం యుద్ధ వ్యూహంలో చిక్కుకుందా? త్వరలో మరో ప్రపంచ యుద్ధం రాబోతోందా? వరల్డ్ వార్ లోకి ఆల్రెడీ అడుగు పెట్టేశామా? వరుస యుద్ధాలు ఈ భయాలే కలిగిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు, రగులుతున్న మిడిల్ ఈస్ట్.. ప్రపంచానికి యుద్ధానికి మరింత ఆజ్యం పోస్తోంది.

ఇప్పుడు ప్రపంచం అంతా యుద్ధంలో మునిగింది. ప్రపంచ యుద్ధం భయాలను క్రియేట్ చేస్తోంది. వరల్డ్ వైడ్ గా ఇప్పుడు యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. ఓవైపు రష్యా, యుక్రెయిన్ బాంబుల మోత మోగించుకుంటూ ఏళ్లు గడిపేస్తున్నాయి. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లోనూ అదే పరిస్థితి. ఏడాది క్రితం మొదలైన యుద్ధం మూడు సంస్థలు, 6 దేశాలను చుట్టుకుంది. రక్తపాతం సృష్టిస్తోంది. ఇజ్రాయెల్ తో పాలస్తీనా, లెబనాన్, సిరియా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధంతో ఎప్పుడు ఎవరు ఎవరి మీద దాడి చేస్తారో అర్థం కాని పరిస్థితి. మరోవైపు ఇందులో అమెరికా ఎప్పుడు జోక్యం చేసుకుంటుందో, అది మూడో ప్రపంచ యద్ధంగా ఎక్కడ మారుతుందోనని ప్రతీ ఒక్కరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఇరాన్ మీద ఇజ్రాయెల్ యుద్ధానికి దిగితే ఈ దాడులు అరబ్ దేశాలు, అమెరికాకు విస్తరించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ కోసం అమెరికా రంగంలోకి దిగింది. తమ దేశం నుంచి శత్రుదుర్బేద్యమైన థాడ్ రక్షణ వ్యవస్థను పంపించింది అమెరికా. అటు హౌతీలు టార్గెట్ గా వైమానిక దాడులకు దిగుతోంది. అంటే ఇజ్రాయెల్ కోసం అమెరికా డైరెక్ట్ గా రంగంలోకి దిగినట్లే. ఇలాంటి సమయంలో యుద్ధం మొదలైతే ఆ హింస, ఆ ఎఫెక్ట్ ఊహించడానికి కూడా భయానకంగా ఉంటుందని అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

మిడిల్ ఈస్ట్ లో అలా.. కొరియా ద్వీపకల్పంలో ఇలా.. ఉద్రిక్తతలు పీక్స్ కి చేరుకున్న వేళ.. చైనా ఓవరాక్షన్ మరిన్ని భయాలు పుట్టిస్తోంది. యుద్ధోన్మాదంలో రగిలిపోతున్న డ్రాగన్.. తైవాన్ సరిహద్దుల్లో తోక జాడిస్తోంది. దీంతో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇక అటు రష్యా-యుక్రెయిన్ వార్ లోకి కిమ్ మామ ఎంట్రీ ఇచ్చాడు. మూడో దేశం వస్తే మూడో ప్రపంచ యుద్ధమే అనే చర్చ జరుగుతున్న వేళ.. ఉత్తర కొరియా వ్యవహారం వరల్డ్ వార్ భయాలను మరింత పెంచుతోంది.

 

Also Read : టార్గెట్ క్లియర్..! ఇక విధ్వంసమేనా? ఇరాన్‌పై దాడులకు ఇజ్రాయెల్ రెడీ..!