2025లో యుగాంతమేనా? భయపెడుతున్న వంగా బాబా, నోస్ట్రడామస్ జోతిష్యం..! నిజమెంత?

నిజంగా వాళ్లు చెప్పింది జరుగుతుందా? వాళ్ల జోష్యాలను నమ్మొచ్చా? ఆ ఇద్దరు చెప్పినట్లే ఇప్పుడు ప్రపంచంలో పరిస్థితులు ఉన్నాయా? 2025 నిజంగా నరకం కాబోతోందా?

Baba Vanga and Nostradamus 2025 Predictions : ప్రకృతి ప్రకోపాలు, యుద్ధం మిగిల్చే విషాదాలు, ఏలియన్ యుద్ధాలు.. 2025 ఇలానే ఉండబోతోందా? వంగా బాబా, నోస్ట్రడామస్ అంచనాలు నిజమవుతాయా? కొత్త ఏడాది సంబరాలకు సిద్ధమవుతున్న జనాలను కొత్త భయాలు వెంటాడుతున్నాయి. 2025 భవిష్యత్తు అంధకారంగా మారబోతోందా? బతకడం కంటే చావే సుఖం అనుకునే రోజులు వచ్చే ఏడాది చూడబోతున్నామా? యుగాంతానికి 2025 నాంది కాబోతోందా? వచ్చే ఏడాది నిజంగా అంత ఘోరంగా ఉండబోతోందా?

2025 భయంకరంగా ఉండబోతుందన్న నోస్ట్రడామస్, వంగా బాబా జోష్యం ఇప్పుడు కొత్త భయాలకు కారణం అవుతోంది. నిజంగా వాళ్లు చెప్పింది జరుగుతుందా? వాళ్ల జోష్యాలను నమ్మొచ్చా? ఆ ఇద్దరు చెప్పినట్లే ఇప్పుడు ప్రపంచంలో పరిస్థితులు ఉన్నాయా? 2025 నిజంగా నరకం కాబోతోందా?

నోస్ట్రడామస్, వంగా బాబా జోతిష్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలామంది నమ్ముతారు. ఇద్దరూ చెప్పిన వాటిలో చాలావరకు నిజమయ్యాయి. భవిష్యత్తు గురించి నోస్ట్రడామస్ రాసిన పుస్తకం 450 ఏళ్ల కింద ప్రచురితమైంది. అందులో చెప్పినవి దాదాపుగా నిజమయ్యాయి. హిట్లర్ ఎదుగుదల నుంచి అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెన్నెడీ హత్య, కరోనా మహమ్మారి వ్యాప్తి ఘటనలు నోస్ట్రడామస్ లెస్ ప్రొఫెటిస్ పుస్తకంలో ఉన్నాయి. హిరోషిమా, నాగసాకిపై అణుబాంబు దాడులు, లండన్ గ్రేట్ ఫైర్, 2022 కాస్ట్ ఆఫ్ లివింగ్ సంక్షోభం వంటి చారిత్రక సంఘటనలను 16వ శతాబ్దంలోనే అంచనా వేశారు నోస్ట్రడామస్. దీంతో 2025లో జరిగే యుద్ధాలు, ప్రకృతి వైపరిత్యాలు, గ్రహాంతర వాసుల గురించి కూడా ఆయన అంచనాలు నిజం అవుతాయనే భయాందోళనలు ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్నాయి.

1966లో చనిపోయిన వంగా బాబా.. తన మరణానికి ముందు ప్రతీ సంవత్సరం సంఘటనలను అంచనా వేసి రాసుకొచ్చారు. అవి కూడా చాలావరకు నిజమయ్యాయి. తన మరణాన్ని ముందే ఊహించి చెప్పారు వంగా బాబు. యువరాణి డయాని మరణం, అమెరికా 9/11 దాడులు, అమెరికా మొదటి నల్ల జాతి అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఎన్నిక.. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రధాన సంఘటనలను వంగా బాబా అంచనా వేశారు. ఆర్థిక పతనాల నుంచి వైద్యపరమైన పురోగతి వరకు అన్నింటిని ఊహించి ముందే రాసుకున్నారు. అయితే, ఇప్పుడీ ఇద్దరూ కూడా 2025 గురించి ఒకేలా జోష్యం చెప్పారు. అదే ప్రపంచాన్ని టెన్షన్ పుట్టిస్తోంది. వాళ్లు చెప్పింది నిజమైతే పరిస్థితి ఊహించుకోవడానికి కూడా భయంకరమే అనే చర్చ జరుగుతోంది.

పూర్తి వివరాలు..

Also Read : సైనిక శక్తిలో ఎవరు తోపు? టాప్ 10 దేశాలు ఏవి, భారత్ స్థానం ఎంత..