Palawan Ferry Accident : ఘోర ప్రమాదం.. నడి సముద్రంలో పడవలో మంటలు.. పలువురు మృతి, 87మంది ఆచూకీ గల్లంతు..
Palawan Ferry Accident : ఫిలిప్పీన్స్లో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 87మంది ఆచూకీ గల్లంతైంది
Palawan Ferry Accident
Palawan Ferry Accident : ఫిలిప్పీన్స్లో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. సముద్ర తీరానికి 1.2 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 87మంది ఆచూకీ గల్లంతైంది. గల్లంతైన ప్రయాణికులు, సిబ్బందికోసం భారీ స్థాయిలో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఫిలిప్పీన్స్లోని పలవాన్ ప్రావిన్స్ ప్రముఖ పర్యాటక ప్రాంతం కొరోన్ సమీప సముద్రంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవలో భారీగా మంటలు చెలరేగాయి. బుధవారం సాయంత్రం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం సమయంలో పడవలో 137మంది ఉన్నారు. వీరిలో 117మంది ప్రయాణికులు కాగా.. 17మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందారు. తాజా సమాచారం ప్రకారం 42 మందిని రక్షించారు. వీరిలో 38 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. మరో 87 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నందున ఈ సంఖ్యలో మార్పులు ఉండొచ్చని ఫిలిప్పీన్ కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. రక్షించిన వారిలో కొందరిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి గుర్తింపును అధికారులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది. పడవలో మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై కూడా దర్యాప్తు ప్రారంభించారు.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో బలమైన అలలు, సముద్ర ప్రవాహాలు ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మంటల్లో చిక్కుకున్న నౌక కూడా సముద్ర ప్రవాహంతో మరింత దూరంగా కొట్టుకుపోయినట్లు సమాచారం. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే ఫిలిప్పీన్ కోస్ట్ గార్డ్, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక విపత్తు నిర్వహణ అధికారులు రంగంలోకి దిగారు. ప్రత్యేక రెస్క్యూ బృందాలను కూడా ఘటనాస్థలికి పంపించారు. సముద్రంలో గల్లంతైన వారి కోసం వ్యవస్థీకృతంగా గాలింపు కొనసాగుతోంది.
Five casualties were initially reported after passenger ship MV June Aster caught fire in waters off Coron, Palawan, on Wednesday (Sept. 9, 2026) night, the Philippine Coast Guard said.
As of 11:10 p.m., PCG spokesperson Commodore Noemie Cayabyab said 42 people had been rescued,… pic.twitter.com/4g7pyW4AsM
— Philippine News Agency (@pnagovph) September 10, 2026
