US Rules on H1B Visa : అమెరికాలోని భారతీయులకు ట్రంప్ మరో బిగ్‌షాక్.. ఇక వారంతా సర్దుకొని రావాల్సిందే!
US Rules on H1B Visa : అమెరికాలో ఉద్యోగం చేస్తున్న H-1B వీసాదారులకు భారీ షాక్ ఇచ్చేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమవుతోంది. అదే జరిగితే.. అమెరికాలో పనిచేస్తున్న ఐటీ నిపుణులపై ఎక్కువ ప్రభావం పడనుంది.
H-1B Workers
US Rules on H1B Visa : అమెరికాలో ఉద్యోగం చేస్తున్న H-1B వీసాదారులకు మరో భారీ షాక్ తగలనుందా? ఉద్యోగం పోయిన తర్వాత కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ప్రస్తుతం ఉన్న 60 రోజుల గడువును రద్దు చేసే దిశగా అమెరికా ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. ఈ నిబంధన అమల్లోకి వస్తే ముఖ్యంగా అమెరికాలోని భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో ఉద్యోగం కోల్పోయిన వెంటనే అమెరికాలో ఉండే హక్కు కోల్పోయే పరిస్థితి వస్తుందా ఆనే ఆందోళన మొదలైంది.
Also Read : Gold Silver Price Today : మహిళలకు భారీ ఊరట.. ఊహించని స్థాయిలో తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే..
అమెరికాలో ఉద్యోగాలు చేసే విదేశీ నిపుణులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం బిగ్ షాకించ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. హెచ్-1బీ వీసాదారులు, తాత్కాలిక వర్క్ వీసాలపై పనిచేసే విదేశీ నిపుణులు తమ ఉద్యోగాన్ని కోల్పోతే కొత్త స్పాన్సర్ ను వెతుక్కోవడానికి లేదా దేశాన్ని విడిచి వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి 60రోజుల గ్రేస్ పిరియడ్ లభిస్తోంది. ఈ విధానం 2017 నుంచి అమల్లో ఉంది. అయితే, ఈ విధానాన్ని రద్దు చేయాలని అమెరికా హొంలాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. దీనిపై సుమారు 60రోజుల పాటు ప్రజల అభిప్రాయాలను సేకరించనున్నారు. ఒకవేళ ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే.. అమెరికాలో ఉండే విదేశీ నిపుణులకు భారీ షాక్ తగిలినట్లే.
గ్రేస్ పీరియడ్ రద్దు అమల్లోకి వస్తే ఎక్కువగా అమెరికాలో ఉండే భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఎందుకంటే.. హెచ్-1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న వారిలో అధికశాతం మంది.. దాదాపు 70శాతం మంది భారతీయులే ఉన్నారు. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే కంపెనీలకు కొంతమేర ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. అయితే, ఖాళీ అయిన ఉద్యోగాలను అమెరికన్లతో భర్తీ చేయవచ్చునని హోంలాండ్ సెక్యూరిటీ విభాగం అభిప్రాయపడింది. ఒకవేళ అదే ఉద్యోగిని కొనసాగించాలని కంపెనీలు భావిస్తే ఐ-129 పిటిషన్ ప్రక్రియను ప్రారంభించాలని సూచించింది.
ఈ ప్రతిపాదన కేవలం హెచ్-1B వీసాలకే పరిమితం కాదు. E-1 (ఇంటర్నేషనల్ ట్రేడర్), E-2 (వాణిజ్య వాహనాల ఆపరేటర్లు), L-1 (అంతర్జాతీయ సంస్థల్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్ లు, మేనేజర్లు), ఓ1 (సైన్స్, క్రీడలు, కళల్లో అసాధారణ ప్రతిభావంతులు) వంటి ఇతర నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా కేటగిరీల ఉద్యోగులు కూడా దీని పరిధిలోకి వస్తారు. వీరి డిపెండెంట్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.
