Gold Silver Price Today : మహిళలకు భారీ ఊరట.. ఊహించని స్థాయిలో తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే..
Gold And Silver Rates Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. ఇవాళ ధరలు తగ్గాయి.

బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. ఊహించని స్థాయిలో తగ్గుదల నమోదు చేశాయి.

శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 2620 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 2400 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ ధర 4331డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. భారతదేశంలో వెండి రేటు భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. 10వేలు తగ్గింది. గత వారం రోజులుగా స్థిరంగా కొనసాగుతూ వస్తున్న వెండి.. ఇవాళ ఒక్కసారిగా భారీగా తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,52,890 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,40,150 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,53,040 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,40,300 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,52,890కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,40,150 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,45,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
