సైనిక శక్తిలో ఎవరు తోపు? టాప్ 10 దేశాలు ఏవి, భారత్ స్థానం ఎంత..

ఎప్పుడు ఏ వైపు నుంచి ముప్పు వస్తుందో ఎవరికీ తెలియదు. ఏ మిస్సైల్ వచ్చి పడుతుందో, ఏ డ్రోన్ అటాక్ కు గురి కావాల్సి వస్తుందో, శత్రువు ఎలా కమ్మేస్తాడో ఊహించడమే కష్టం.

సైనిక శక్తిలో ఎవరు తోపు? టాప్ 10 దేశాలు ఏవి, భారత్ స్థానం ఎంత..

Updated On : October 21, 2024 / 10:51 AM IST

Most Powerful Nations By Military Strength : ఎప్పుడు ఏ వైపు నుంచి ముప్పు వస్తుందో ఎవరికీ తెలియదు. ఏ మిస్సైల్ వచ్చి పడుతుందో, ఏ డ్రోన్ అటాక్ కు గురి కావాల్సి వస్తుందో, శత్రువు ఎలా కమ్మేస్తాడో ఊహించడమే కష్టం. రివెంజ్ తీసుకునే టైమ్ ఉంటుందో లేదో కూడా చెప్పలేం. అందుకే దాడికి ప్రతిఘటన ఉండాలి.

లేకపోతే తేలిపోతాం అంటూ అన్ని దేశాలు అలర్ట్ అవుతున్నాయి. అనుకోకుండా ఏ దేశమైనా అటాక్ చేస్తే తిప్పి కొట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. రష్యా-యుక్రెయిన్ వార్, మిడిల్ ఈస్ట్ యుద్ధాలతో కంట్రీస్ అన్నీ అలర్ట్ అయిపోతున్నాయి. తమకే ఆ పరిస్థితి వస్తే ఏంటంటూ.. డిఫెన్స్ స్ట్రెంతెన్ మీద ఫోకస్ చేశాయి. ఇంతకీ ఏ దేశం సత్తా ఎంత? డిఫెన్స్ అంటే ఆయుధాలు, యుద్ధ ట్యాంకులేనా?

యుద్ధం అన్నాక దాడి తప్పనిసరి. సేమ్ టైమ్ ప్రతిఘటన కూడా ఉండాలి. దాడికి ప్రతి దాడి చేయడమే కాదు దాడిని తిప్పికొట్టడం కూడా ఓ తంత్రమే. అందుకే అటాక్ జరిగితే దాన్ని ఆకాశంలోనే తిప్పికొట్టే డిఫెన్స్ సిస్టమ్ మీద ఫోకస్ పెట్టాయి వివిధ దేశాలు. నష్టం జరిగాక ప్రతీకారం తీసుకోవడం కంటే… దాడి నుంచి తప్పించుకునే ప్లాన్ కావాలంటూ.. టెక్నాలజీకి పదును పెడుతున్నాయి. యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులు, ఆయుధాల అవసరం కొంతవరకు.

ఇక అంతా అత్యాధునిక యుద్ధ తంత్రమే అంటున్నాయి దేశాలు. ఆకాశంలోనే దాడులు, అందుకు సిద్ధం అంటూ రెడీ అవుతున్నాయి కంట్రీస్. దాడి చేసేది ఎలా? శత్రువు అటాక్ నుంచి తప్పించుకోవడం ఎలా? ప్రతిఘటనకు ఉండాల్సిన డిఫెన్స్ సిస్టమ్ ఏంటి? ఏ దేశం ఎలా అప్ డేట్ అవుతోంది?

హైటెక్ డిఫెన్స్ సిస్టమ్, అడ్వాన్స్డ్ వెపన్స్ తో నింగి, నేల, సముద్రం.. ఎక్కడైనా పటిష్టంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి దేశాలు. అంతకంతకూ ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ లేటెస్ట్ ఎక్విప్ మెంట్ ఏదైనా.. మన ఫ్యాక్టరీలో చేరాల్సిందే అంటున్నాయి. ముప్పు ఎలా వచ్చినా తట్టుకునేందుకు రెడీ అవుతున్నాయి.

* ప్రపంచంలోని టాప్ 10 మిలటరీలలో అగ్రరాజ్యం అమెరికా ఫస్ట్ ప్లేస్ లో ఉంది.
* కీలకమైన మెటీరియల్, రిసోర్స్ కేటగిరీలలో తన సత్తా చాటుకుంది.
* అమెరికా దగ్గర 13వేల యుద్ధ విమానాలు, 21 లక్షల 27వేల మంది సైనికులు ఉన్నారు.
* 983 వార్ హెలికాప్టర్లు ఉన్నాయి.

* ఇక అధునాతన సాంకేతికత, సైనిక శక్తితో రష్యా సెకండ్ ప్లేస్ లో నిలిచింది.
* రష్యా దగ్గర 35 లక్షల 70వేల భద్రతా బలగాలు.
* 4వేల 225 యుద్ధ విమానాలు, 14వేల 777 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి.

* ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాల్లో ఒకటైన చైనా మిలటరీలో మూడో స్థానంలో ఉంది.
* చైనా నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటూ వస్తోంది.
* చైనా దగ్గర 3వేల 304 యుద్ధ విమానాలు, 5వేల యుద్ధ ట్యాంకులు ఉన్నాయి.

* మిలటరీ పరంగా మన భారత్ ఫోర్ట్ ప్లేస్ లో ఉంది.
* మన దేశానికి 51 లక్షల 37వేల 550 మంది సైనిక సిబ్బంది ఉన్నారు.
* భారత్ దగ్గర 2వేల 216 యుద్ధ విమానాలు, 4వేల 614 వార్ ట్యాంకులు ఉన్నాయి.

 

Also Read : ప్రపంచం వినాశనానికి 2025 వేదిక కాబోతుందా.. నోస్ట్రాడమస్, బాబా వంగా ఏం చెప్పారో తెలుసా..