Nostradamus and Baba Vanga: ప్రపంచం వినాశనానికి 2025 వేదిక కాబోతుందా.. నోస్ట్రాడమస్, బాబా వంగా ఏం చెప్పారో తెలుసా..
2025లో ప్రపంచంలో తీవ్రమైన గందరగోళ పరిస్థితి నెలకొంటుందని, ఐరోపాలో భయంకరమైన యుద్ధాలకు జరుగుతాయని, గ్రహాంతర వాసుల నుంచి పెనుముప్పు పొంచిఉందని ..

Nostradamus and Baba Vanga
Nostradamus and Baba Vanga : భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని ప్రతిఒక్కరూ ఆసక్తి చూపుతుంటారు. అయితే, రాబోయే కాలంలో ఏం జరగబోతుంది..? ఎలాంటి విపత్కర పరిస్థితులను ప్రపంచం ఎదుర్కోబోతుందనే విషయాలపై ప్రపంచంలోని అనేక మంది ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు ముందుగానే అంచనా వేశారు. వాటిని పుస్తకాలు, ఇతర రూపాల్లో పొందుపర్చారు. మైఖెల్ డి నోస్ట్రాడమస్, బాబా వంగాల పేర్లు ఈ కోవలో ప్రముఖంగా వినిపిస్తాయి. అయితే, వీరి అంచనా ప్రకారం 2025లో ప్రపంచంలో తీవ్రమైన గందరగోళ పరిస్థితి నెలకొంటుందని, ఐరోపాలో భయంకరమైన యుద్ధాలు జరుగుతాయని, గ్రహాంతర వాసుల నుంచి పెనుముప్పు పొంచిఉందని అంచనా వేశారు.
Also Read: వెనక్కి తగ్గని హమాస్-ఇజ్రాయెల్.. పశ్చిమాసియాలో యుద్ధం ఆగేదెప్పుడు?
నోస్ట్రాడమస్ అంచనా ప్రకారం.. 2025లో ప్రకృతి వైపరిత్యాలతోపాటు దేశాల మధ్య వివాదాలు తీవ్రస్థాయికి చేరుతాయని అంచనా వేశారు. ముఖ్యంగా ఐరోపాలో భయంకరమైన యుద్ధాలు జరగుతాయని, రష్యా – యుక్రెయిన్ మధ్య యుద్ధం ముగిసే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. ప్రపంచంలోని పలు దేశాల్లో పెద్దెత్తున వరదలు సంభవిస్తాయని, ముఖ్యంగా బ్రెజిల్ విపరీతమైన ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు. అదేవిధంగా నోస్ట్రాడమస్ ‘ఆక్వాటిక్ సామ్రాజ్యం’ పెరిగే అవకాశాన్ని కూడా సూచించాడు.
బాబా వంగా అంచనాల ప్రకారం.. 2025లో ఐరోపా ప్రధాన భూభాగంలోని రెండు దేశాల మధ్య వివాదం తీవ్రరూపందాల్చుతుందని, ఇది ప్రపంచ వ్యాప్తంగా వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుందని అంచనా వేశారు. ఆమె అంచనా ప్రకారం.. ఈ సంఘటనలు ప్రపంచ అంతానికి దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోని ఓ ప్రముఖ ఈవెంట్ లో గ్రహాంతర వాసుల దాడి గురించి ఆమె ప్రస్తావించారు. బహుశా సూపర్ బౌల్ వంటి క్రీడా ఈవెంట్ సమయంలో అయ్యి ఉండొచ్చని అంచనా వేశారు. వచ్చే ఏడాదిలోపు మానవులు టెలిపతిని పరిపూర్ణం చేస్తారని బాబా వంగా అంచనా వేశారు. ప్రకృతి విపత్తులతో పాటు ప్రపంచం అల్లకల్లోలంగా మారుతుందని అంచనా వేశారు.
Also Read: గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. ఆ ప్రాంతంలో వైమానిక దాడులు..
ప్రపంచంలో నోస్ట్రాడమస్, బాబా వంగా భవిష్యత్తు అంచనాలను చాలా మంది నమ్ముతారు. గతంలో వీరి భవిష్యత్ అంచనాలు అనేకం నిజమయ్యాయి. వారిద్దరూ 2025లో యుద్ధాలు, ప్రకృతి వైపరిత్యాలు, దేశాల మధ్య ఘర్షణలు, గణనీయమైన తిరుగుబాట్లను అంచన వేశారు. దీంతో వారు అంచనా వేసినట్లుగా.. 2025 సంవత్సరం ఉండబోతుందా.. ప్రపంచం వినాశనానికి అడుగులు పడబోతున్నాయా.. అనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతుంది.