గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. ఆ ప్రాంతంలో వైమానిక దాడులు..
మరోవైపు ఇజ్రాయెల్ పై సిరియా వైమానిక దాడులకు యత్నించింది.

Israel Strikes On Gaza
Israel Gaza War : గాజాపై ఇజ్రాయెల్ దాడులు కంటిన్యూ అవుతున్నాయి. ఉత్తర గాజాలో జరిపిన వైమానిక దాడుల్లో 33 మంది పాలస్తీనా వాసులు చనిపోయారు. ఈ మేరకు అక్కడి అధికారిక వార్తా సంస్థ ప్రకటించింది. ఉత్తర గాజాలోని జబాలియా శిబిరం ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. మృతుల్లో 21 మంది మహిళలు మరణించారు. ఈ దాడుల్లో కనీసం 85 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనేకమంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 42వేల 500 మందికిపైగా మృతి చెందినట్లు గాజా ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
మరోవైపు ఇజ్రాయెల్ పై సిరియా వైమానిక దాడులకు యత్నించింది. తమ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన వైమానిక దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. తమ భూభాగంలోకి ఆ డ్రోన్లు ప్రవేశించక ముందే వాటిని కూల్చేసినట్లు తెలిపింది. ఇరాన్ మద్దతుతోనే సిరియా ఈ డ్రోన్లను ప్రయోగించిందని తెలిపింది.
అల్ మగాజీలోని సెంట్రల్ గాజా స్ట్రిప్ క్యాంపులో ఒక ఇంటిపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 11 మంది మరణించగా, సమీపంలోని నుసెరాత్ శిబిరం వద్ద జరిగిన మరో దాడిలో మరో నలుగురు చనిపోయారు. దక్షిణ గాజా నగరాలు ఖాన్ యూనిస్, రఫాలో జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో మరో ఐదుగురు ప్రాణాలు వదిలారు. ఉత్తర గాజా స్ట్రిప్‌లోని అల్-షాతి శిబిరంలో ఏడుగురు పాలస్తీనియన్లు మరణించినట్లు వైద్యులు తెలిపారు.
జబాలియాలో కనీసం మూడు ఇళ్లను ధ్వంసం చేసింది ఇజ్రాయెల్. 33 మంది చనిపోగా.. మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నారు. సుమారు 85 మంది గాయపడ్డారని వైద్యులు తెలిపారు.
Also Read : మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసినట్లేనా? ప్రపంచం ఇక రోజులు లెక్క పెట్టాల్సిందేనా?