అమెరికా నిర్ణయంతో ఇక మూడో ప్రపంచ యుద్ధమేనా? అధ్యక్షుడు బైడెన్ సంచలన నిర్ణయం..

రష్యా యుక్రెయిన్ యుద్ధ గతిని మార్చేలా బైడెన్ నిర్ణయం తీసుకున్నారు.

Russia Ukraine War : రష్యా యుక్రెయిన్ యుద్ధానికి మరింత ఆజ్యం పోశాడు అమెరికా అధ్యక్షుడు బైడెన్. క్షిపణి దాడుల పైన సంచలన నిర్ణయం తీసుకున్నారు. బైడెన్ డెసిషన్ తో యుక్రెయిన్ కు మంచి ఛాన్స్ దొరికినట్లైంది. దీంతో యుద్ధ రూపు రేఖలే మారబోతున్నాయి. ఇక రెండు దేశాల మధ్య కనిపించబోయేది విధ్వంసమే. విలయం ఊహకు కూడా అందకపోవచ్చన్న భయాలూ వ్యక్తమవుతున్నాయి. యుద్ధాన్ని ఆపుతానన్న ట్రంప్ ఆలోచనకు విరుద్ధంగా బైడెన్ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ప్రపంచ దేశాలను భయపెడుతోంది.

రష్యా యుక్రెయిన్ యుద్ధానికి మరో 3 నెలల్లో మూడేళ్లు పూర్తవుతుంది. వార్ ఎప్పుడు ఆగుతుందా అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచారు. ఇక, యుద్ధానికి ఫుల్ స్టాప్ పడుతుందని అంతా అనుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్ ఆ దిశగా చర్యలు మొదలుపెట్టారు కూడా. కట్ చేస్తే బైడెన్ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇది అమల్లోకి వస్తే జరగబోయే విధ్వంసం, కనిపించబోయే విలయం ఊహించడానికి కూడా భయంకరం అనిపిస్తోంది.

రష్యా యుక్రెయిన్ యుద్ధ గతిని మార్చేలా బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. యుక్రెయిన్ కు తాము అందిస్తున్న దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై దాడికి వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇదే ప్రపంచాన్ని ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. యుద్ధం ముదిరి ప్రపంచ యుద్ధానికి దీరి తీస్తుందా? అనే భయాలను క్రియేట్ చేస్తోంది.

యుక్రెయిన్ పై రష్యా భారీ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో రష్యా 60 క్షిపణులను ప్రయోగించింది. యుక్రెయిన్ పై ఇప్పటివరకు రష్యా జరిపిన దాడుల్లో ఇదే అతి పెద్దది. ఈ దాడుల సమయంలో కీవ్ ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లలో తల దాచుకున్నారు. కీవ్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రష్యా దాడులు చేసింది. ఈ దాడులకు ఇరాన్ నుంచి తీసుకొచ్చిన డ్రోన్లను రష్యా ఉపయోగించినట్లు తెలుస్తోంది.

పూర్తి వివరాలు..

Also Read : మహారాష్ట్రలో ఓటర్ల మనసు గెలిచేది ఎవరు? అధికారంలో నిలిచేది ఎవరు?