మహారాష్ట్రలో ఓటర్ల మనసు గెలిచేది ఎవరు? అధికారంలో నిలిచేది ఎవరు?
ఈసారి మాత్రం మహారాష్ట్ర రాజకీయం మరింత రసవత్తరంగా కనిపిస్తోంది.

Maharashtra Assembly Elections 2024 : కొన్ని గంటలు.. ఇంకొన్ని గంటలు అంతే.. మహా ఎన్నికల్లో కీలక ఘట్టం మొదలు కావడానికి. పోలింగ్ డే కోసం మహారాష్ట్ర సర్వం సిద్ధమైంది. ఒక్క రాష్ట్రానికో, 288 స్థానాలకో జరుగుతున్న ఎన్నిక కాదది. భవిష్యత్ రాజకీయాలను డిసైడ్ చేయబోయే ఎలక్షన్ ఇది. ఆ ఫలితం దేశం నలుమూలలా రీసౌండ్ ఇవ్వడం ఖాయం. దేశమంతా కూడా మహారాష్ట్ర వైపు చూస్తోంది అందుకే. మహారాష్ట్ర విజేత ఎవరు, విన్నర్ ను డిసైడ్ చేయబోయేది ఎవరు, కూటములను కామన్ గా టెన్షన్ పెడుతున్న విషయం ఏంటి?
బలం నిరూపించుకోవడానికి ఓ పార్టీకి, బలం తగ్గలేదని ప్రూవ్ చేసుకోవడానికి మరో పార్టీకి మహారాష్ట్ర ఎన్నికలు చాలా కీలకం. నిజానికి గత 30 ఏళ్లలో మహారాష్ట్రలో ఏ పార్టీ సొంతంగా అధికారం చేపట్టలేదు. పొత్తులు, కూటములే ప్రభుత్వాలను నడిపించాయి. అయితే, ఈసారి మాత్రం మహారాష్ట్ర రాజకీయం మరింత రసవత్తరంగా కనిపిస్తోంది.
ప్రాంతాయ పార్టీలైన శివసేన, ఎన్సీపీ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిణామాల్లో రెండుగా చీలిపోయాయి. దీంతో ఈ ఎన్నికల్లో సత్తా చాటి తమదే అసలు పార్టీ అని ప్రూవ్ చేసుకునేందుకు షిండే సేన, ఉద్దవ్ వర్గం, అజిత్ ఎన్సీపీ, శరద్ పవార్ గ్రూపులు పోరాటం చేస్తున్నాయి. షిండే సేన, అజిత్ ఎన్సీపీ, బీజేపీ కలిసి అధికార మహాయుతిగా.. ఉద్దవ్ సేన, శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి మహా వికాస్ అఘాడీగా కూటములు ఏర్పడ్డాయి. ఆరు పార్టీలు, రెండు గ్రూపులు.. ఓటర్ల మనసు గెలిచేది ఎవరు? అధికారంలో నిలిచేది ఎవరు? అనేది దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది.
పూర్తి వివరాలు..
Also Read : అమెరికా నిర్ణయంతో ఇక మూడో ప్రపంచ యుద్ధమేనా? అధ్యక్షుడు బైడెన్ సంచలన నిర్ణయం..