US Presidential Election 2024 : అంతా అయిపోయింది. సమయం దగ్గరకు వచ్చేసింది. నవంబర్.. ఈ నెల పైనే ప్రపంచం చూపు. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై నరాలు తెగే ఉత్కంఠ మరింత పెరుగుతూ వస్తోంది. కమలా హారిస్ ప్రెసిడెంట్ పీఠం ఎక్కడం పక్కా అని కొందరు.. కాదు కాదు.. ట్రంపే అధ్యక్షుడు అవుతాడని ఢంకా బజాయించి లెక్కలు కడుతున్న వాళ్లు ఇంకొందరు. కానీ, స్వింగ్ ఈజ్ కింగ్ అంటున్నాయి సర్వేలు. ఇంతకీ ఆ స్వింగ్ ఏంటి? అదెలా విజేతలను డిసైడ్ చేస్తుంది?
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఉత్కంఠ మరింత పెరుగుతోంది. ప్రచారం పీక్స్ కు చేరి క్లైమాక్స్ కు వెళ్తున్న కొద్దీ ఇప్పుడు ఓటర్ల మైండ్ సెట్, సర్వేలపైనే అందరిచూపు ఉంది. ఏ పార్టీ అభ్యర్థి వైపు ఏయే రాష్ట్రాల ప్రజలు మొగ్గు చూపుతారనే టెన్షన్ మొదలైంది. దీంతో ఈసారి ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేసేది ఆ ఏడు రాష్ట్రాలే అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఏంటా సెవెన్ స్వింగ్ స్టేట్స్.
నెవడా, అరిజోనా, విస్కాన్ సిన్, మిచిగాన్, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియా.. ఈ ఏడు రాష్ట్రాలను ఈసారి అమెరికా ఎన్నికల్లో స్వింగ్ స్టేట్స్ అంటున్నారు. ఇక్కడి ఓటర్లే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమన్న మాట. వీళ్లే ఫలితాలను డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్. ఈ 7 స్వింగ్ స్టేట్స్ లో మొత్తం 93 ఎలక్టోరల్ కాలేజ్ సీట్లు ఉన్నాయి.
అమెరికాలో పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ అందరిలోనూ బీపీ పెరిగిపోతోంది. రోజులు లెక్కేసుకుంటున్నారు అందరూ. సర్వేల్లో విజయావకాశాలు అటు కమలా హారిస్, ఇటు ట్రంప్ మధ్య దోబూచులాడుతున్నాయి. మామూలు సర్వేల్లో కమల కాస్త ముందున్నా.. ఆర్థిక నిర్వహణ సామర్థ్యంలో ట్రంప్ వైపే ఆర్థికవేత్తలు మొగ్గు చూపుతున్నారని కొన్ని సర్వే రిపోర్టులు అంటున్నాయి. దీంతో స్వింగ్ స్టేట్స్ ను బుట్టలో వేసుకుంటే తప్ప.. ఆయా అభ్యర్థులు గెలుపు తీరాలు వెళ్లే ఛాన్స్ కనిపించడం లేదు.
ఏడు స్వింగ్స్ స్టేట్స్ లో పెన్సిల్వేనియాలో అత్యధికంగా 19 ఎలక్టోరల్ కాలేజ్ సీట్లు ఉన్నాయి. దీంతో ఈ రాష్ట్రంపైనే అందరిచూపు ఉంది. మ్యాజిక్ ఫిగర్ 270ని చేరుకోవాలంటే పెన్సిల్వేనియా ది పిన్ పాయింట్. ఈసారి ఎన్నికల్లో కమలా హారిస్ ఒకవేళ పెన్సిల్వేనియాను చేజార్చుకుంటే నార్త్ కరోలినా లేదా జార్జియాపై పట్టు పెంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డెమోక్రాటిక్ అభ్యర్థులకే గతంలో మద్దతు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
అలాగే ట్రంప్ పెన్సిల్వేనియా ఓట్లను కొల్లగొట్టలేకపోతే అప్పుడు విస్కాన్ సిన్ లేదా మిచిగాన్ ఓట్లను సాధించాల్సి ఉంటుంది. 1980 నుంచి రిపబ్లికన్ అభ్యర్థులవైపే ఇక్కడి ఓటర్లు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. 2016లో ట్రంప్ కు ఇక్కడ మద్దతు ఎక్కువగా లభించింది. ఒక పెన్సిల్వేనియాలోనే 279 మిలియన్ డాలర్లు ప్రచారానికి కమలా హారిస్, ట్రంప్ ఖర్చు చేశారంటే.. ఈ స్టేట్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు.
Also Read : దారికొచ్చిన డ్రాగన్..! మోదీ విదేశాంగ విధానంతో జిన్‌పింగ్ మైండ్ బ్లాక్..!