దారికొచ్చిన డ్రాగన్..! మోదీ విదేశాంగ విధానంతో జిన్‌పింగ్ మైండ్ బ్లాక్..!
లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ ఏసీలో భారత్-చైనా బలగాలకు మధ్య ఘర్షణ ఇప్పటిది కాదు.

India China Border Agreement : మాతో పెట్టుకుంటే మడతడిపోద్ది అంటోంది భారత్. సమయం వచ్చిన ప్రతీసారి విషం కక్కే డ్రాగన్ కు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా నేర్పిస్తోంది. దీంతో తూర్పు లద్దాఖ్ నుంచి ఇండో-చైనా ఆర్మీ వెనక్కి మళ్లుతున్నాయి. ఇప్పటివరకు జరిగింది ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అనేలా ప్రధాని మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానంతో జిన్ పింగ్ మైండ్ బ్లాక్ అవుతోంది. దీంతో భారత్ తో కయ్యం కంటే.. కాళ్ల బేరమే నయమని డ్రాగన్ దారికొస్తున్నట్లు తెలుస్తోంది.
బ్రిక్స్ సమావేశం వేదికగా మోదీ, జిన్ పింగ్ భేటీ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఇరు దేశాల ఒప్పందాల్లో భాగంగా జరిగిన కీలకమైన పరిణామాలను గతంలో తుంగలో తొక్కిన చైనా.. ఇక నుంచైనా బుద్ధిగా ఉంటుందా? లేక గిల్లి కజ్జాలకు మళ్లీ తెరలేపుతుందా? అనే అనుమానాలు అందరిలోనూ ఇంకా ఉన్నాయి. అదే సమయంలో ఇతర దేశాలతో భారత్ అనుసరించే సరికొత్త విదేశాంగ విధానమే శ్రీరామరక్ష అనే వాదన కూడా ఉంది. దాని ఫలితంగానే ప్రత్యర్థి దేశాలకు భారత్ తిక్క కుదురుస్తోందని, శత్రుదేశాలు కూడా దారికొస్తున్నాయన్నది విశ్లేషకుల భావన.
లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ ఏసీలో భారత్-చైనా బలగాలకు మధ్య ఘర్షణ ఇప్పటిది కాదు. సరిహద్దు సమస్యలు దశాబ్దాలుగా ఉన్నాయి. చైనా-భారత్ సరిహద్దులను వాస్తవాధీన రేఖగా చెప్పే ఎల్ ఏసీ విభజిస్తుంది. పశ్చిమాన లద్దాక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ కు తూర్పువైపు వరకు ఈ ఎల్ ఏసీ ఉంది. ఇక్కడ కొన్ని ప్రాంతాలను చైనా తమవేనని అంటోంది. 1962లో భారత్-చైనా వార్ జరిగింది. సరిహద్దుల్లో చొరబాట్లు, దురాక్రమణలను భారత్ గట్టిగా ప్రతిఘటించింది. లద్దాఖ్ దగ్గర ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని భారత్ చేజార్చుకుంది.
బోర్డర్ లో శాంతి కోసం 1990లో భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక చర్చలు, ఒప్పందాలు జరిగాయి. 1993, 96 మధ్య చేసుకున్న ఒప్పందాలతో ఎల్ ఏసీ వద్ద టెన్షన్స్ కొంతమేరకు కంట్రోల్ లోకి వచ్చాయి. దాదాపు 3వేల 488 కిలోమీటర్ల ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లో.. భారత సైన్యం, చైనా ఆర్మీ నిరంతరం గస్తీ కాస్తుంటాయి. చీమ చిటుక్కుమన్నా అలర్ట్ అవుతుంటాయి. 2020లో లద్దాఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయలో చైనా ఆర్మీ చొరబాట్లను అడ్డుకునేందుకు భారత సైన్యం ప్రతిఘటించింది. దీంతో అప్పటి నుంచి ఇప్పటివరకు పలుమార్లు చైనా సైన్యం భారత ఆర్మీతో రెచ్చగొట్టే వైఖరిని అవలంభిస్తూ వస్తోంది.
Also Read : ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ సైన్యం.. అమెరికా ఏమన్నదంటే?