China Tension : ఏ నోటితో కశ్మీర్ విషయంలో ఓవరాక్షన్ చేసిందో అలాంటి బాధ, భయమే డ్రాగన్ ను వెంటాడుతోంది. దీంతో భారత్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. చైనాను ఉగ్ర భయం వెంటాడుతోంది. సిరియా అనుభవాలు వెంటాడుతున్న వేళ.. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం డ్రాగన్ కు నిద్ర లేకుండా చేస్తోంది. ఇంతకీ చైనా భయపెడుతోంది ఎవరు? డ్రాగన్ కు ఇప్పటికైనా భారత్ విలువ తెలిసొచ్చిందా?
కర్మ డ్రాగన్ ను వెంటాడుతోందా అంటే అదే అనిపిస్తోంది పరిస్థితులు చూస్తుంటే. పాకిస్తాన్ కు అండగా ఉండి కశ్మీర్ ఉగ్రవాదం విషయంలో భారత్ మీద ఓవరాక్షన్ చేసిన చైనాను ఇప్పుడు అదే సమస్య అంతే లెవెల్ లో టెన్షన్ పెడుతోంది. ఓవైపు పాకిస్తాన్ లో టెన్షన్, మరోవైపు దూసుకొస్తున్న యుగర్లు.. దీంతో ఏం చేయాలో తెలియక, ఎలా చేయాలో అర్థం కాక.. సరిహద్దు దేశాలకు దగ్గరవడం మొదలు పెట్టింది డ్రాగన్.
భారత్ తో చర్చలు, అంగీకారాల వెనక కనిపించింది, వినిపించింది అదే. ఇప్పటికే పాకిస్తాన్ లో పడుతున్న ఇబ్బందులకు వీగర్ల నుంచి మరో కొత్త టెన్షన్ వచ్చింది. పాకిస్తాన్ లో 6 నెలల్లో రెండుసార్లు చైనా పౌరులను టార్గెట్ చేసుకుని తీవ్రవాదులు దాడులు చేశారు. ఇప్పుడు యుగర్లు చైనాను దున్నేసేందుకు దూసుకొస్తున్నారు. ఇలా తీవ్రవాద సమస్య డ్రాగన్ కు తలపోటుగా మారింది.
సిరియా పరిణామాలు చైనాను మరింత టెన్షన్ పెడుతున్నాయి. ఒక్కో నగరాన్ని కైవసం చేసుకోవడంలో, అసద్ పాలనను అంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఓ గ్రూప్ ఇప్పుడు చైనాకు సవాల్ విసురుతోంది. ఇదే డ్రాగన్ కు నిద్ర లేకుండా చేస్తోంది. సిరియా అయిపోయింది తమ నెక్ట్స్ టార్గెట్ తూర్పు తుర్కిస్తాన్ అంటూ డిసెంబర్ 8న తుర్కిస్తాన్ ఇస్లామిక్ పార్టీ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇదే ఇప్పుడు చైనాకు కొత్త టెన్షన్ లా తయారైంది. తూర్పు తుర్కిస్తాన్ ప్రస్తుతం చైనా పాలనలో ఉంది. డీఐపీలో వ్యూగర్లు ఎక్కువ. చైనా మీద వీళ్లంతా రగిలిపోతున్నారు. 1990లో అణిచివేత తర్వాత వ్యూగర్లు దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత తహ్రీర్ అల్ షామ్ ఉగ్రవాద సంస్థతో కలిసి యుద్ధంలో శిక్షణ తీసుకున్నారు. పదేళ్లలో అద్భుతమైన పోరాట అనుభవాన్ని సంపాదించారు. సిరియా తిరుగుబాటులోనూ తుర్కిస్తాన్ ఇస్లామిక్ పార్టీ కీలక పాత్ర పోషించింది.
అందితే జట్టు, అందకపోతే కాళ్లు.. చైనా తీరు ఇదే. ఇప్పుడు భారత్ కు దగ్గర కావడానికి కారణం కూడా ఇదే. ఇండియాతో శాంతి మంత్రం జపిస్తోంది. అసలు ఓ ఉగ్రవాద సంస్థ సవాల్ కు చైనా ఇంతలా ఎందుకు టెన్షన్ పడుతోంది? భారత్ కు దగ్గరవడం వెనుక అసలు వ్యూహం వేరే ఉందా? చైనా శాంతి మంత్రం నిజమేనా? మరో నాటకమా? అసలు డ్రాగన్ ను నమ్మొచ్చా, లేదా?
Also Read : యుక్రెయిన్‌తో యుద్ధం ముగింపుపై పుతిన్ కీలక ప్రకటన.. భారత్‌పై ప్రశంసలు