Vladimir Putin: యుక్రెయిన్‌తో యుద్ధం ముగింపుపై పుతిన్ కీలక ప్రకటన.. భార‌త్‌పై ప్రశంసలు

రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం సుదీర్ఘంగా సాగిన విలేకరుల సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. యుక్రెయిన్ పై యుద్ధం విషయాన్ని ప్రస్తావించగా..

Vladimir Putin: యుక్రెయిన్‌తో యుద్ధం ముగింపుపై పుతిన్ కీలక ప్రకటన.. భార‌త్‌పై ప్రశంసలు

Russian President Putin

Updated On : December 20, 2024 / 10:11 AM IST

Ukraine Russia War: యుక్రెయిన్, రష్యా దేశాల మధ్య కొద్దికాలంగా యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. యుక్రెయిన్ లోని పలు ప్రాంతాలపై రష్యా మిసైళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది. ప్రతిగా అమెరికా మద్దతుతో రష్యాపై యుక్రెయిన్ దళాలు దాడులు చేస్తున్నాయి. యుక్రెయిన్ పై దాడులను ఆపాలని పలుసార్లు అమెరికా సహా పలు దేశాలు రష్యాను హెచ్చరించగా.. మరికొన్ని దేశాలు సూచనలు చేశాయి. అయితే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేస్తూ వచ్చారు. అయితే, తాజాగా యుక్రెన్ తో యుద్ధం ముగించేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ పేర్కొన్నారు. అయితే, కొన్ని షరతులు విధించారు.

Also Read: Vijay Mallya – Lalit Modi : డియర్ ఫ్రెండ్.. మనకు దేశంలోనే అన్యాయం జరిగింది.. విజయ్ మాల్యా-లలిత్‌ మోదీ పోస్టు వైరల్..!

గురువారం సుదీర్ఘంగా సాగిన విలేకరుల సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన వివిధ ప్రశ్నలకు పుతిన్ సమాధానం ఇచ్చారు. యుక్రెయిన్ పై యుద్ధం విషయాన్ని ప్రస్తావించగా.. యుక్రెయిన్ తో యుద్ధం ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే, ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మినహా ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎలాంటి ముందస్తు షరతులు కూడా పెట్టబోమన్న పుతిన్.. ఆ దేశ పార్లమెంట్ తోనే చర్చలు జరుపుతామని చెప్పారు. యుక్రెయిన్ పై తాము చేపట్టిన ప్రత్యేక సైనిక ఆపరేషన్ విజయవంతం అవుతోందని పుతిన్ పేర్కొన్నారు. తమ దళాలు రోజుకొక చదరపు కిలో మీటర్ యుక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమిస్తూనే ఉన్నాయని, యుక్రెయిన్ తో యుద్ధంలో తాము విజయానికి చేరువలో ఉన్నామని పుతిన్ పేర్కొన్నారు.

Also Read: Indian Dishes: వరల్డ్ బెస్ట్-100 వంటకాల్లో హైదరాబాద్ బిర్యానీకి చోటు.. భారత్ నుంచి నాలుగు వంటకాలు.. అవేవో తెలుసా?

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ గురించి పుతిన్ మాట్లాడుతూ.. ట్రంప్ తో నాలుగేళ్లుగా తాను మాట్లాడలేదు.. అయితే, ప్రస్తుతం ఆయనతో భేటీ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ చెప్పారు. భారతదేశం ఆర్థికంగా పురోభివృద్ధి చెందుతున్న దేశమని పుతిన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీకి ‘మేక్ ఇన్ ఇండియా’ అనే కార్యక్రమం ఉంది. భారతదేశంలో పలు విభాగాల్లో మా తయారీ కార్యకలాపాలను ఏర్పాటు చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం స్థిరమైన పరిస్థితులను సృష్టిస్తోంది. భారత్ లో పెట్టుబడులు పెట్టడం లాభదాయకమని మేము నమ్ముతున్నామని పుతిన్ పేర్కొన్నారు.