Indian Dishes: వరల్డ్ బెస్ట్-100 వంటకాల్లో హైదరాబాద్ బిర్యానీకి చోటు.. భారత్ నుంచి నాలుగు వంటకాలు.. అవేవో తెలుసా?
హైదరాబాద్ బిర్యానీకి దేశవ్యాప్తంగానే కాకా.. ప్రపంచ వ్యాప్తంగానూ యమ క్రేజ్ ఉంది. ఆ విషయం మరోసారి రుజువైంది.

Hyderabad biryani
Taste Atlas: హైదరాబాద్ బిర్యాని.. ఈ పేరు వింటే చాలు మాంసాహారులు ఎవరైనా నోరు చప్పరించాల్సిందే. బిర్యానీకి అంతటి క్రేజ్ మరి. హైదరాబాద్ బిర్యానీకి దేశవ్యాప్తంగానే కాకా.. ప్రపంచ వ్యాప్తంగానూ యమ క్రేజ్ ఉంది. ఆ విషయం మరోసారి రుజువైంది. టేస్ట్ అట్లాస్ ఎప్పటిలాగే ఈ ఏడాది (2024-2025) కూడా ప్రపంచ వ్యాప్తంగా 11,258 డిషెస్ లో వంద ఉత్తమ వంటకాల జాబితాను తయారు చేసింది. ఇందులో మన దేశం నుంచి నాలుగు వంటలు ఎంపికయ్యాయి. వాటిలో హైదరాబాద్ బిర్యానీ ఒకటి.
Also Read: Zomato: బాబోయ్.. జొమాటోలో రూ.10 వాటర్ బాటిల్ 100 రూపాయలా? కంపెనీ స్పందన ఏమిటంటే?
టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన జాబితాలో లెచోనా వంటకం అగ్రస్థానంలో ఉంది. ఇది కొలంబియన్ వంటకం. రెండో స్థానంలో ఇటలీకి చెందిన నపొలిటానా పిజ్జా, మూడో స్థానంలో బ్రెజిల్ కు చెందిన పిక్యానొ స్టీక్ అనే వంటకం నిలిచింది. ఇక నాలుగు ఐదు స్థానాల్లో అల్జీరియాకు చెందిన రెచ్టా, థాయ్ లాండ్ కు చెందిన ఫనాంగ్ కర్రీ చోటు దక్కించుకుంది. ఇక భారతదేశంకు చెందిన వంటకాల్లో ముర్గ్ మఖాని 29వ స్థానం దక్కించుకుంది. 31వ స్థానంలో హైదరాబాద్ బిర్యానీ చోటు దక్కించుకోగా.. చికెన్ -65 వంటకం 97వ స్థానంలో నిలవగా.. కీమా 100వ స్థానంలో చోటు దక్కించుకుంది.
టేస్ట్ అట్లాస్ తన సర్వేలో ఐదు ఆయా వంటలకు స్టార్స్ ఇచ్చింది. ఈ క్రమంలో భారతీయ వంటకాలైన ముర్గ్ ముఖాని, హైదరాబాద్ బిర్యానీలు ఐదుకు 4.52 స్టార్స్ దక్కించుకున్నాయి. చికెన్-65, కీమాకు 4.44 స్టార్స్ దక్కాయి. ఈ జాబితాలో మొదటి స్థానం దక్కించుకున్న కొలంబియన్ సాంప్రదాయానికి చెందిన లెచోనా వంటకం 4.78 స్టార్స్ దక్కించుకుంది.
View this post on Instagram