Zomato: బాబోయ్.. జొమాటోలో రూ.10 వాటర్ బాటిల్‌ 100 రూపాయలా? కంపెనీ స్పందన ఏమిటంటే?

సోషల్ మీడియాలో ఓ పోస్టు తెగ వైరల్ అవుతుంది. వాస్తవానికి ఆఫ్ లీటర్ వాటర్ బాటిల్ రూ. 10 మాత్రమే. కానీ, ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫారమ్ జొమాటో అదే వాటర్ బాటిల్ ను ..

Zomato: బాబోయ్.. జొమాటోలో రూ.10 వాటర్ బాటిల్‌ 100 రూపాయలా? కంపెనీ స్పందన ఏమిటంటే?

Water Bottle Price in Zomato

Updated On : December 19, 2024 / 9:07 AM IST

Water Bottle Price in Zomato: సోషల్ మీడియాలో ఓ పోస్టు తెగ వైరల్ అవుతుంది. వాస్తవానికి ఆఫ్ లీటర్ వాటర్ బాటిల్ రూ. 10 మాత్రమే. కానీ, ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫారమ్ జొమాటో అదే వాటర్ బాటిల్ ను రూ. 100కు విక్రయిస్తుందంటూ ఆ పోస్టు సారాంశం. ఈ పోస్టు బుధవారం నుంచి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ పోస్టు పెట్టిన వ్యక్తి పేరు పల్లబ్ దే. అతను ఐటీ ఉద్యోగి.

Also Read: OnePlus 13 Series Launch : వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13ఆర్ సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ తెలిసిందోచ్..!

పల్లబ్ దే ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ ఈవెంట్ లో రూ. 10 వాటర్ బాటిల్ ను రూ. 100కు అమ్ముతున్నట్లు గుర్తించాడు. పల్లబ్ దే ట్వీట్ ప్రకారం.. ‘‘ తాము పాల్గొన్న ఈవెంట్ లో వాటర్ బాటిల్స్ నిషేదం. ఈవెంట్ నిర్వహించే వాళ్లే వాటర్ బాటిళ్లను అమ్మతున్నారు. దీంతో జొమాటో ద్వారా ఆ వాటర్ బాటిళ్లను విక్రయిస్తున్నారని తెలిసింది. దాహం వేస్తుంది కదా అని రూ.10 వాటర్ బాటిళ్లను రెండింటిని కొనుగోలు చేశా. రూ. 20 ఇవ్వబోగా.. సదరు వాటర్ బాటిల్ అమ్మే వ్యక్తి నా నుంచి రూ. 200 వసూలు చేశాడు. ఎవరూ తమ సొంత వాటర్ బాటిళ్లను తీసుకురావడానికి అనుమతించని ఈవెంట్ లో రూ. 10 వాటర్ బాటిల్ ను రూ. 100కి విక్రయించడానికి జొమాటోకి అనుమతి ఎలా వచ్చింది..?’’ అంటూ రెండు వాటర్ బాటిళ్ల ఫొటోలను ట్వీట్ లో జత చేశాడు. దీంతో జొమాటోపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలా చేయడం ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. దీంతో పల్లబ్ దే ట్వీట్ కు జొమాటో స్పందించింది.

Also Read: UPI QR Code Scams : ఆన్‌లైన్ పేమెంట్లకు యూపీఐని వాడుతున్నారా? క్యూఆర్ కోడ్ స్కామ్‌లను ఎలా నివారించాలంటే?

జొమాటో స్పందిస్తూ.. ‘‘హాయ్ పల్లబ్, మీకు ఎదురైన ఇబ్బందికి మమ్మల్ని క్షమించండి. మేము ఆ వాటర్ బాటిల్స్ ను విక్రయించలేదు. వాస్తవానికి మేము ఈవెంట్ నిర్వాహకులు కానప్పటి, టికెటింగ్ భాగస్వామిగా ఉన్నాం. అయినప్పటికీ కస్టమర్ కు కలిగిన అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.