Vijay Mallya – Lalit Modi : డియర్ ఫ్రెండ్.. మనకు దేశంలోనే అన్యాయం జరిగింది.. విజయ్ మాల్యా-లలిత్‌ మోదీ పోస్టు వైరల్..!

Vijay Mallya - Lalit Modi : విజయ్ మాల్యా 69వ పుట్టినరోజు సందర్భంగా మాజీ ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోదీ ఎక్స్‌ పోస్ట్‌లో శుభాకాంక్షలు తెలిపారు. లలిత్‌ మోదీ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Vijay Mallya – Lalit Modi : డియర్ ఫ్రెండ్.. మనకు దేశంలోనే అన్యాయం జరిగింది.. విజయ్ మాల్యా-లలిత్‌ మోదీ పోస్టు వైరల్..!

Vijay Mallya - Lalit Modi

Updated On : December 19, 2024 / 10:17 PM IST

Vijay Mallya – Lalit Modi : బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన బిలియనీర్‌ విజయ్‌ మాల్యాకు లలిత్‌ మోదీకి మధ్య ఆసక్తికరమైన చాటింగ్ జరిగింది. విజయ్ మాల్యా 69వ పుట్టినరోజు సందర్భంగా మాజీ ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోదీ ఎక్స్‌ పోస్ట్‌లో శుభాకాంక్షలు తెలిపారు. లలిత్‌ మోదీ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లలిత్ మోదీ పోస్టుకు విజయ్‌ మాల్యా కూడా తనదైన శైలిలో స్పందించారు. వీరిద్దరి మధ్య సంభాషణ ఎలా కొనసాగిందో ఇప్పుడు చూద్దాం..

‘నా ప్రియమైన స్నేహితుడు విజయ్ మాల్యాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. జీవితంలో హెచ్చు తగ్గులు సహజమే. జీవితం “ఎత్తుపల్లాలు” రెండింటినీ మనద్దరికి చూపించింది. ఇది కూడా గడిచిపోతుంది. రాబోయే సంవత్సరం మీదే మిత్రమా. ప్రేమ, చిరునవ్వుతో ఉండవచ్చు.

లలిత్ మోదీ పోస్టుకు విజయ్ మాల్యా స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. నా ప్రియమైన స్నేహితుడికి ధన్యవాదాలు మాల్యా పోస్ట్‌లో రాశాడు. మనం ఏదో దేశానికి చేయాలని ప్రయత్నించిన మన ఇద్దరినీ నిందించే ప్రయత్నం జరిగింది. మనం దేశానికి ఎంతో చేసినా మనకు అన్యాయమే జరిగిందని విజయ్ మాల్యా బదులిచ్చారు.

తన నుంచి ఎక్కువ మొత్తంలో రుణం వసూలు చేయడంపై విజయ్ మాల్యా ప్రశ్నలు సంధించారు. మాల్యాపై బకాయిపడిన రూ.6302 కోట్ల రుణానికి సంబంధించి రూ.14,131.6 కోట్లు రికవరీ చేశామని అంతకుముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో చేసిన ప్రకటనలో తెలిపారు. ఆర్థిక మంత్రి ఈ ప్రకటన తర్వాత విజయ్ మాల్యా తన పోస్ట్‌లో కింగ్‌ఫిషర్‌కు రూ. 6203 కోట్ల అప్పు ఉందని, ఇందులో వడ్డీ రూ. 1200 కోట్లు ఉందని డెట్ రికవరీ ట్రిబ్యునల్ తీర్పునిచ్చిందని చెప్పుకొచ్చారు.

కానీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో మాట్లాడుతూ.. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాలు రూ. 6203 కోట్లకు బదులుగా, ఈడీ సాయంతో బ్యాంక్ నుంచి రూ. 14,131.60 కోట్లను రికవరీ చేశాయని మంత్రి నిర్మల ప్రకటించారు. దీనిపై మాల్యా స్పందిస్తూ.. నేను ఇప్పటికీ ఆర్థిక నేరగాడిగానే మిగిలిపోయాను. బాకీ ఉన్న రుణాన్ని రెట్టింపు ఎలా రికవరీ చేయవచ్చో ఈడీ, బ్యాంకులు చట్టబద్ధంగా సమర్థించనంతవరకు, ఉపశమనం పొందేందుకు నేను అర్హుడనని, దాని కోసం పోరాడుతానని విజయ్ మాల్యా ట్వీట్ చేశారు.

తనపై సీబీఐ కేసుల వాదనలను కూడా మాల్యా ప్రశ్నించారు. “ఐడీబీఐ బ్యాంక్ అధికారులతో సహా అనేక మంది ఇతర వ్యక్తులతో కలిసి ఐడీబీఐ బ్యాంక్ నుంచి రూ. 900 కోట్ల రుణాన్ని మోసపూరితంగా పొందారని, వారి క్రెడిట్ కమిటీ, బోర్డు ఆమోదం పొందిందని, పూర్తి రుణం, వడ్డీని తిరిగి చెల్లించినట్లు నాపై సీబీఐ అభియోగాలు మోపారు. 9 ఏళ్ల తర్వాత ఎందుకు కచ్చితమైన ఆధారాలు లేవన్నారు. దీనికి సమాధానంగా.. ఇది కూడా దాటిపోతుంది అని లలిత్ మోదీ అన్నారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బాధితులు లేదా నిజమైన హక్కుదారులకు రూ. 22,280 కోట్ల విలువైన ఆస్తులను పునరుద్ధరించిందని, ఆర్థిక నేరగాళ్లపై పోరాటం నిరంతరం కొనసాగుతుందని నిర్మలా సీతారామన్ ప్రకటించిన తర్వాత విజయ్ మాల్యా ఎక్స్ పోస్ట్‌లు వైరల్ అయ్యాయి. పారిపోయిన విజయ్ మాల్యాకు చెందిన రూ. 14,131.6 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు పునరుద్ధరించినట్లు ఆమె తెలిపారు.

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కేసుకు సంబంధించి రూ. 1,052.58 కోట్ల ఆస్తులు (PSB), ప్రైవేట్ బ్యాంకులకు పునరుద్ధరించారు. మెహుల్ చోక్సీ కేసులో రూ. 2,565.90 కోట్ల విలువైన ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసి వేలం వేయనున్నట్టు ప్రకటించారు.

Read Also : ChatGPT On WhatsApp : వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై ఈ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి చాట్‌జీపీటీతో చాట్ చేయొచ్చు..!