Sri Lanka Crisis : సామాన్యులకు ‘పిక్నిక్‌ స్పాట్‌’గా మారిన శ్రీలంక అధ్యక్షుడి ప్యాలెస్..!

దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్సే అధికారిక నివాసాన్ని లక్షలాది ఆందోళనకారులు ముట్టడించారు. దీంతో ఆయన ప్యాలెస్ వదిలిపారిపోయారు. దీంతో ప్రజలు అధ్యక్షభవనంలో చిల్ అవుతున్నారు. బెడ్ రూమ్ అనీ లేదు..కిచెన్ అనీ లేదు. సామాన్యులకు ప్రవేశంలేని దేశాధ్యక్షుడు భవనంలో ఇప్పుడు పెద్దవారు చిన్నవారు అనే తేడా లేకుండా ఇష్టానురీతిగా ఇష్టమొచ్చింది చేస్తున్నారు. స్మిమ్మింగ్ పూల్ లో ఎగిరెగిరి దూకుతున్నారు. బెడ్ పై కుస్తీలు పడుతున్నారు. జిమ్ లో కసరత్తులు చేసేస్తున్నారు.

Sri Lanka Crisis : శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతునే ఉంది. ప్రజలు రోడ్లపైకొచ్చి ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులకు దిగుతున్నారు. దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్సే అధికారిక నివాసాన్ని లక్షలాది ఆందోళనకారులు ముట్టడించారు. దీంతో ఆయన ప్యాలెస్ వదిలిపారిపోయారు. దీంతో ప్రజలు అధ్యక్షభవనంలో చిల్ అవుతున్నారు. తమకు ఇష్టమొచ్చినట్లుగా చేస్తున్నారు. బెడ్ రూమ్ అనీ లేదు..కిచెన్ అనీ లేదు. సామాన్యులకు ప్రవేశంలేని దేశాధ్యక్షుడు భవనంలో ఇప్పుడు పెద్దవారు చిన్నవారు అనే తేడా లేకుండా ఇష్టానురీతిగా ఇష్టమొచ్చింది చేస్తున్నారు. స్మిమ్మింగ్ పూల్ లో ఎగిరెగిరి దూకుతున్నారు. బెడ్ పై కుస్తీలు పడుతున్నారు. జిమ్ లో కసరత్తులు చేసేస్తున్నారు. ఆకలేస్తు కిచెన్ లోకి వెళ్లి ఇష్టమొచ్చింది వండుకుని తినేస్తున్నారు. ఇలా దేశాధ్యక్షుడి భవనంలో సామన్య ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు.

గొటబాయ రాజపక్స కుటుంబీకులపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన శ్రీలంక ప్రజలు.. చివరకు అధ్యక్ష భవనంలోకి చొచ్చుకొని వెళ్లి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వేల మంది నిరసనకారులు అధ్యక్ష భవనంలో ప్రతి గదిలో కలియతిరుగుతన్నారు. అక్కడున్న అన్ని సౌకర్యాలను అనుభవిస్తు ఆస్వాదిస్తున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడాలేకుండా రెండోరోజు కూడా వేల మంది ప్రజలు అధ్యక్షుడి భవనంలోకి ఎగబడి మరీ వెళుతున్నారు. దేశంలో సామాన్య ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటుంటే పాలకులు మాత్రం లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నారంటూ అధ్యక్షుడిపై మండిపడుతున్నారు. ఇలా శ్రీలంక అధ్యక్ష భవనం ప్రస్తుతం ఓ పిక్నిక్‌ సెంటర్‌గా మారిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

శ్రీలంక అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు ఆదివారం (జులై 10,2022) కూడా అక్కడే ఉండిపోయారు. భవనంలో ఉన్న ప్రతిగదిలో తిరుగుతూ ప్రతి వస్తువునూ పరిశీలిస్తున్నారు. అధ్యక్షుడు కుర్చీలో కూర్చొని సెల్ఫీ దిగుతున్నారు. దీని కోసం పోటీ పడుతున్నారు. బెడ్‌రూం మంచంపై పడుకోవడం, పియానో వాయించడం, ఖరీదైన కార్లతో సెల్ఫీలు దిగడం, వంటగదిలోకి వెళ్లి ఇష్టమొచ్చింది తినటం..జ్యూసులు తయారు చేసుకుని తాగటం..వంటి చర్యలతో అధ్యక్ష భవనం కిక్కిరిసిపోయింది. అధ్యక్ష నివాస ప్రాంగణంలోనే భారీ సామగ్రితో వంటలు చేయడంతోపాటు అక్కడే వారి కుటుంబాలతో కలిసి భోజనం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

స్మిమ్మింగ్ పూల్ లో జనాలు ఎగిరెగిరి దూకుతు ఎంజాయ్ చేస్తున్నారు. వందల మంది ఈత కొట్టడంతో చివరకు అది మురికిగా మారిపోయింది. అధ్యక్షుడు గదిలో రూ.కోటి రూపాయలకు పైగా విలువ చేసే కరెన్సీ కట్టలను గుర్తించిన ఆందోళనకారులు.. వాటిని పోలీసులకు అందజేశారు. ఇలా అధ్యక్ష భవనం పిక్నిక్‌ స్పాట్‌గా మారిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వేల సంఖ్యలో ఆందోళనకారులు భవనంలోకి వస్తున్న క్రమంలో అక్కడి వస్తువులను తీసుకుపోవడం, ధ్వంసం చేయడం వంటివి చేయవద్దని అధ్యక్ష భవనంలో పోస్టర్లు వెలవడం గమనించాల్సిన విషయం.

అధ్యక్షుడు..ప్రధానమంత్రి తమ పదవులకు మూడు రోజుల్లో రాజీనామా చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయినా ఆ ప్రకటన సరిపోదని.. తక్షణమే వారు తమ పదవులను వీడాలని డిమాండ్‌ చేస్తున్నారు ప్రజలు. వారు రాజీనామా చేసేంత వరకు అధ్యక్ష భవనం నుంచి కదిలే ప్రసక్తే లేదని ఆందోళనకారులు తేల్చిచెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు