అమ్మకాలను పెంచేందుకు : పచ్చిచేపను తిన్న శ్రీలంక మాజీ ఎమ్మెల్యే

  • Publish Date - November 19, 2020 / 02:50 AM IST

Sri Lankan lawmaker eats raw fish : seafood అమ్మకాలను పెంచేందుకు శ్రీలంక మాజీ ఎమ్మెల్యే పచ్చి చేపలను తిన్నారు. కరోనా మహమ్మారి కారణంగా..శ్రీలంకలో చేపల అమ్మకాలు దారుణంగా క్షీణించాయి. కరోనా కాలంలో చేపలు, ఇతర సీ ఫుడ్ తింటే..ఆరోగ్యానికి ప్రమాదమనే పుకార్లు షికారు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పోస్టులు వైరల్ గా మారాయి. కరోనా కాలంలో చేపలను తింటే..ఏమి జరగదని మాజీ ఎమ్మెల్యే Dilip Wedaarachchi ప్రజలకు తెలియచేయాలని నిర్ణయం తీసుకున్నారు.



అందులో భాగంగా..విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎలాంటి భయం లేకుండా చేపలను తినొచ్చని ప్రజలను ప్రోత్సాహించారు. దేశ ప్రజలు చేపలను తినడం లేదని, అందుకే తాను ఒక చేపను తీసుకొచ్చానని చూపిస్తూ..దానిని తిన్నారు. చేపలను తినాలని, కరోనా వైరస్ సోకదని ప్రజలకు సూచించారాయన. 2019 వరకు ఈయన మత్స్యశాఖ మంత్రిగా పనిచేశారు.



ప్రధాన మార్కెట్లలో చేపల అమ్మకాలను క్షీణించాయని రాయిటర్స్ నివేదించింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు బయటపడ్డాయి. ఫలితంగా..మార్కెట్ మూసివేయాల్సి రావడంతో..పది వేల టన్నుల చేపలు అమ్ముడుపోలేదు. ప్రజలు చేపలు కొనకపోయేసరికి ధరలు అమాంతం పడిపోయాయి. ప్రస్తుతం శ్రీలంకలో 18 వేల 308 కోవిడ్ – 19 కేసులు నమోదయ్యాయి. 66 మంది చనిపోయారు.