150 Point Turn : వైరల్ వీడియో… కారుని ఎలా టర్న్ చేసిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే

న్యూజిలాండ్ లో ఓ డ్రైవర్ తన కారుని పార్కింగ్ స్పాట్ నుంచి బయటకు తెచ్చిన వైనం వైరల్ గా మారింది. వాస్తవానికి రివర్స్ గేర్ వేస్తే సరిపోతుంది. కారు సులభంగా బయటకు వస్తుంది. కానీ ఆమె అలా

150 Point Turn

150 Point Turn : న్యూజిలాండ్ లో ఓ డ్రైవర్ తన కారుని పార్కింగ్ స్పాట్ నుంచి బయటకు తెచ్చిన వైనం వైరల్ గా మారింది. వాస్తవానికి రివర్స్ గేర్ వేస్తే సరిపోతుంది. కారు సులభంగా బయటకు వస్తుంది. కానీ ఆమె అలా చెయ్యలేదు. 150 పాయింట్ టర్న్ ఉపయోగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పార్కింగ్ స్పేస్ నుంచి కారుని బయటకు తియ్యడానికి నాలుగు నిమిషాలు పట్టింది. కారుని చుట్టూ తిప్పింది. ఫార్వార్డ్, రివర్స్ గేర్స్ వాడితే ఎంతో సింపుల్ గా కారుని బయటకు తీయొచ్చు. కానీ ఆ డ్రైవర్ అలా చెయ్యలేదు.

No Smoking : వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్నా స్మోకింగ్ చేయకూడదు.. ఉద్యోగులకు కొత్త రూల్

న్యూజిలాండ్ లోని క్వీన్స్ టౌన్ లో ఫైవ్ మైల్ షాపింగ్ సెంటర్ దగ్గర ఈ ఘటన జరిగింది. మార్క్ బార్నెస్ అనే వ్యక్తి తన కొడుకుతో కలిసి మిల్క్ షేక్ తాగేందుకు వెళ్లాడు. అదే సమయంలో ఈ ఘటన జరిగింది. మార్క్ బార్నెస్ జూలై 27న ఈ వీడియో తీశాడు.

ఆ కారు డ్రైవర్ ఓ మహిళ. కారుని పార్కింగ్ ప్లేస్ లో పెట్టింది. షాపింగ్ తర్వాత కారు దగ్గరికి వచ్చింది. తన కారు ఎక్కింది. సింపుల్ గా రివర్స్ చేస్తే కారు బయటకు వస్తుంది. అయితే ఆమె అలా చెయ్యలేదు. ఆ కొద్దిపాటి స్థలంలోనే కారుని 150 పాయింట్ టర్న్ చేసింది. ఇందుకోసం ఆమె నాలుగు నిమిషాలు కష్టపడింది. చివరికి కారుని బయటకు తీసుకొచ్చింది. కొందరు ఆమెని జీనియస్ అని పొగిడితే మరికొందరు స్టుపిడ్ అని తిడుతున్నారు. సింపుల్ గా రివర్స్ చేసి ఉంటే సరిపోయేదని అంటున్నారు.

Typhus Vaccine : పేన్లతో ఏ వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేసారో తెలుసా??

ఆ మహిళ కారుని నడిపిన వైనం ఆశ్చర్యానికి గురి చేసింది. నమ్మశక్యంగా లేదని కొందరు కామెంట్ చేశారు. ఈ దృశ్యాన్ని ఆస్టిన్ పవర్స్ సినిమా సీన్ తో కొందరు పోల్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్వల్ప సమయంలోనే 2లక్షల మంది వీక్షించారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది టూ మచ్, ఇల్లాజికల్, ఇంప్రెసివ్ ఎఫర్ట్ అని ఒకరంటే, ఆమె టాలెంట్ కు కచ్చితంగా మెడల్స్ ఇవ్వాల్సందే అని మరొకరు కామెంట్ చేశారు.