No Smoking : వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్నా స్మోకింగ్ చేయకూడదు.. ఉద్యోగులకు కొత్త రూల్

జపాన్ కి చెందిన నోమురా హోల్డింగ్స్ కంపెనీ తన ఉద్యోగులకు కొత్త నిబంధన పెట్టింది. పని వేళల్లో స్మోకింగ్ (ధూమపానం) చేయకూడదు. ఈ నిబంధన ఆఫీసులో మాత్రమే కాదు.. ఇంట్లో నుంచి పని చేసే వాళ్

No Smoking : వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్నా స్మోకింగ్ చేయకూడదు.. ఉద్యోగులకు కొత్త రూల్

No Smoking

No Smoking : జపాన్ కి చెందిన నోమురా హోల్డింగ్స్ కంపెనీ తన ఉద్యోగులకు కొత్త నిబంధన పెట్టింది. పని వేళల్లో స్మోకింగ్ (ధూమపానం) చేయకూడదు. ఈ నిబంధన ఆఫీసులో మాత్రమే కాదు.. ఇంట్లో నుంచి పని చేసే వాళ్లకి కూడా వర్తిస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు కూడా సిగరెట్ తాగడానికి వీల్లేదు. నోమురా హోల్డింగ్స్.. జపాన్ దేశంలోనే అతిపెద్ద బ్రోకరేజ్ సంస్థ. తన ఉద్యోగులకు మెమో పంపింది. నో స్మోకింగ్ పాలసీ అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.

అంతేకాదు.. నోమురా గ్రూప్ నిర్వహిస్తున్న అన్ని స్మోకింగ్ గదులను మూసివేస్తున్నట్టు కంపెనీ చెప్పింది. అయితే వర్కింగ్ హవర్స్ లో ఉద్యోగులు స్మోకింగ్ చేస్తున్నారా? లేదా? అన్నది తాము మానిటర్ చేయబోమని, ఉద్యోగులపై తమకు నమ్మకం ఉందని, పని వేళల్లో వారు స్మోకింగ్ చేయరని నమ్ముతున్నామని కంపెనీ చెప్పింది. స్మోకింగ్ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ధూమపానంతో జబ్బుల బారిన పడుతున్నారు. ఊపిరితిత్తులు దెబ్బతిని చనిపోతున్నారు.

Typhus Vaccine : పేన్లతో ఏ వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేసారో తెలుసా??

అనుకూలమైన పని వాతావరణం కల్పించేందుకు, ఉద్యోగుల ఆరోగ్యం కోసం తాము ఈ చర్యలు చేపట్టినట్లు నోమురా గ్రూప్ వివరించింది. ఉద్యోగులు తమ సామర్థ్యాన్ని, పాత్రను పూర్తిగా ప్రదర్శించడానికి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఉల్లాసంగా జీవించగలిగే వాతావరణం ఉండాలి” అని చెప్పింది. ఒకవేళ ఉద్యోగులు పని వేళల్లో స్మోకింగ్ చేస్తే శిక్షిస్తారా? అని అడిగితే.. అందుకు నో అని యాజమాన్యం జవాబిచ్చింది. ఈ చర్య పరస్పర విశ్వాసం మీద ఆధారపడి ఉందంది.

కాగా, జపాన్ లో చాలా సంస్థలు.. పని ప్రదేశాలలో ధూమపానాన్ని నిరుత్సాహపరుస్తున్నాయి. నోమురా కొత్త రూల్ అందులో ఒక భాగమే. ఉద్యోగులు ధూమపానం మానేస్తే, అది వారి ఉత్పాదకతను పెంచుతుందని కంపెనీలు వాదించాయి. ఈ చర్య నమ్మకంపై ఆధారపడినందున, నోమురా తన ఉద్యోగులపై నిఘా ఉంచడం ఇష్టం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది.

World Safest City: ప్ర‌పంచంలో సుర‌క్షిత‌మైన న‌గ‌రం కోపెన్ హాగెన్..ఎందుకంటే..

జపాన్‌లోని నేషనల్ క్యాన్సర్ సెంటర్ ఈ మార్చిలో ఒక సర్వే నిర్వహించింది. ఇంటి నుంచి పని(వర్క్ ఫ్రమ్ హోమ్) ప్రారంభమైనప్పటి నుండి జపాన్ లో సిగరెట్ వినియోగం పెరిగిందని ఆ సర్వేలో తేలింది. ప్రతి 10మందిలో ఇద్దరు మునుపటి కంటే ఎక్కువగా స్మోకింగ్ చేస్తున్నారని సర్వేలో వెల్లడైంది. దీనికి కారణం ఇంట్లో ఎలాంటి ఆంక్షలు లేకపోవడమే అంది.

నోమురా వెబ్‌సైట్ ప్రకారం, జపాన్‌లో తన ఉద్యోగుల్లో ధూమపానం రేటును 2025 నాటికి 12% కి తగ్గించాలని టార్గెట్ గా పెట్టుకుంది. మార్చి 2020లో అది 20శాతంగా ఉంది. ఉద్యోగులు స్మోకింగ్ మానేయడానికి నోమురా సంస్థ 2017 నుంచి వారికి ఆర్థిక సాయం కూడా అందిస్తోంది.

ఇక 2018 లో స్నాక్స్ తయారీదారు కాల్బీ ఇంక్.. పని వేళల్లో ధూమపానం నిషేధించింది. ఎందుకంటే కంపెనీ అభివృద్ధి చెందాలంటే.. ఉద్యోగులు, వారి కుటుంబసభ్యుల ఆరోగ్యం ముఖ్యం అని చెప్పింది. ఫుడ్ ప్రొడ్యూసర్ అజినోమోటో 2019 లో నో-స్మోకింగ్-వర్కింగ్ పాలసీని ఏర్పాటు చేసింది. ఇది రిమోట్‌గా పనిచేసే సిబ్బందికి కూడా వర్తిస్తుంది. సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ టెలికం యూనిట్ సైతం గతేడాది ఏప్రిల్ లో ఇలాంటి రూలే తీసుకొచ్చింది.