Suicide Bomber : క్రిస్మస్ వేళ మారణహోమం.. ఆత్మహుతి దాడిలో ఆరుగురు మృతి

క్రిస్మస్ వేళ కాంగోలో తీవ్ర విషాదం నెలకొంది. బార్‌ను టార్గెట్‌గా చేసుకొని ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆరుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.

Suicide Bomber

Suicide Bomber : క్రిస్మస్ వేళ కాంగోలో తీవ్ర విషాదం నెలకొంది. బార్‌ను టార్గెట్‌గా చేసుకొని ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆరుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. క్రిస్మస్ పర్వదినం కావడంతో క్రైస్తవులు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో నార్త్ కివూ ప్రావిన్స్ లోని బేని నగరంలోని ఓ బార్‌కి వెళ్లారు. సెలెబ్రేషన్స్ జరుగుతున్న సమయంలో పేలుడు పదార్దాలతో వచ్చిన ఓ వ్యక్తి బార్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అతడిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అతడు ప్రవేశద్వారం వద్దనే బాంబ్ పేల్చాడు.

చదవండి : Long Range Bomb : భారత్ మరో ఘనత..లాంగ్ రేంజ్ బాంబ్ ప్రయోగం విజయవంతం

అనంతరం కొందరు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మృతి చెందినట్లు నార్త్ కివు గవర్నర్ తెలిపారు. పేలుడు తర్వాత ఆ ప్రాంతంలో మొత్తం పొగ కమ్మేయడంతో ప్రజలు అక్కడి నుంచి బయటకు వెళ్లలేకపోయారని గవర్నర్ తెలిపారు. ఇదే సమయంలో అక్కడ తొక్కిసలాట జరిగినట్లు వివరించారు. ఉగాండాకు చెందిన ADF ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటుందని అనుమానం వ్యక్తమవుతోంది.

చదవండి : 24 రోజులుగా జైలులోనే ఉన్న ఆర్యన్ ఖాన్ _ Bombay HC to Shortly Begin Hearing Aryan Khan’s Bail Plea