లుక్లా ఎయిర్ పోర్టులో ప్రమాదం జరిగింది. సమ్మిట్ ఎయిర్ పోర్టుకు చెందిన విమానం..హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. టెకాఫ్ అివుతుండగా ఇది జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిలో పైలట్ కూడా ఉన్నారు. స్థానికంగా ఉన్న ఆస్పత్రికి వీరిని తరలించి చికిత్స అందిస్తున్నారు.
లుక్లా నుండి ఖాట్మండుకు విమానం వెళ్లాల్సి ఉంది. ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరాల్లో ఒకటైన ఖొమొలుంగామాకు ఈ విమానాశ్రయం దగ్గరిగా ఉంటుంది. ఏప్రిల్, మే నెలల్లో ఇక్కడకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.