Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్ ఆ రోజున వస్తారు.. ప్రస్తుతం ఏం జరుగుతోంది?
సునీతా, బుచ్ విల్మోర్ తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండడంతో వారికి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తి ఉండొచ్చని భావిస్తున్నారు.

Astronaut Sunita Williams
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకు పోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను మార్చిన 16న భూమి మీదకు తీసుకువస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. స్పేస్‌ఎక్స్ డ్రాగన్‌లో వారిద్దరిని భూమిపైకి తీసుకురానున్నామని నాసా చెప్పింది.
సునీతా, బుచ్ విల్మోర్ తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉన్నారు. వారిద్దరిని మార్చి 19న భూమి మీదకు తీసుకువస్తామని ఇంతకు ముందు నాసా ప్రకటించింది. ఇప్పుడు ఆ తేదిని కాస్త ముందుకు జరిపింది.
నాసా, స్పేస్ ఎక్స్ చేపట్టిన క్రూ-9 మిషన్‌ను అంతరిక్ష కేంద్రానికి పంపించారు. దాని ద్వారా సునీతా, బుచ్ విల్మోర్ భూమి మీదకు రానున్నారు. క్రూ-9 సిబ్బందిని రిలీవ్ చేసేందుకు వెళ్లే క్రూ-10 ప్రయోగం బుధవారం జరిగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేసుకున్నారు.
Also Read: సమయం ఆసన్నమవుతోంది.. డీఏ పెంపుపై ఇక గుడ్‌న్యూస్..
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ గత ఏడాది జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో ఐఎస్‌ఎస్‌కి వెళ్లారు. అయితే, స్టార్‌లైనర్ ప్రొపల్షన్, థ్రస్టర్ సిస్టమ్‌లలో సమస్యలతో వారు అక్కడి నుంచి తిరిగి రాలేకపోయారు.
తొమ్మిది నెలలకు పైగా అక్కడే ఉంటున్నారు. వారిని తిరిగి భూమి మీదకు తీసుకురావడానికి నాసా, స్పేస్ ఎక్స్ కలిసి పనిచేస్తున్నాయి. స్టార్‌లైనర్‌లో వారు రావడం కుదరకపోవడంతో స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్‌లో తిరిగి వచ్చేలా నాసా ఏర్పాట్లు చేసింది. క్రూ-10 మిషన్ ప్రయోగం జరిగిన తర్వాత విలియమ్స్, విల్మోర్ అమెరికాకు తిరిగి ప్రయాణానికి సిద్ధమవుతారు.
సునీతా, బుచ్ విల్మోర్ తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండడంతో వారికి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తి ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో వారు భూమి మీదకు రాగానే వారికి వైద్య పరీక్షలు చేసి, చికిత్స అందించే అవకాశం ఉంది.