సునీతా విలియమ్స్‌ను తీసుకువచ్చే క్రూ-9 మిషన్‌ లాంచింగ్‌కు సర్వం సిద్ధం

క్రూ-9 మిషన్‌ ద్వారా ఇద్దరు అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, తిరిగి వచ్చేటప్పుడు నలుగురు భూమి మీదకు వస్తారు.

sunita williams

NASA Crew-9 mission: నాసా, స్పేస్‌ ఎక్స్ చేపట్టిన క్రూ-9 మిషన్‌ను ఇవాళ రాత్రి లాంచ్ చేయనున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ను ఈ మిషన్‌ ద్వారా భూమి మీదకు తీసుకొస్తారు.

ఈ నెల 26నే ఈ ప్రయోగం చేయాలని నాసా, స్పేస్‌ ఎక్స్ భావించగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో, ఫ్లోరిడా పశ్చిమ తీరంలో ఉష్ణమండల తుపాను హెలెన్ కారణంగా తుపాను కారణంగా ఈ ప్రయోగం నేటికి వాయిదా పడిన విషయం తెలిసిందే.

అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ-9 మిషన్ ద్వారా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరిగి భూమి మీదకు తీసుకువస్తారు. కొన్ని నెలల క్రితం అంతరిక్ష కేంద్రానికి బోయింగ్‌ స్టార్‌లైనర్‌ ద్వారా వెళ్లిన సునీతా విలియమ్స్‌, బుచ్ విల్మోర్ అందులో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు.

తుపాను ప్రభావం తగ్గడంతో క్రూ-9 మిషన్‌ను లాంచ్ చేయడానికి శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఈ మిషన్‌ లాంచింగ్‌ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసార కవరేజీ ద్వారా ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు నాసా అధికారిక వెబ్‌సైట్ లేదా యూట్యూబ్‌లో చూడొచ్చు. క్రూ-9 మిషన్‌ ద్వారా ఇద్దరు అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, తిరిగి వచ్చేటప్పుడు నలుగురు భూమి మీదకు వస్తారు.

అంటే నాసా వ్యోమగామి నిక్ హేగ్, రోస్కోస్మోస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్‌ ఐఎస్‌ఎస్‌ వెళ్తారు. వారు తిరిగి వచ్చేటప్పుడు సునీతా విలియమ్స్‌, బుచ్ విల్మోర్‌ను కూడా తీసుకువస్తారు.

అమెరికాలోని టీనేజర్లలో ఈ ఇంజెక్షన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయిన వైనం