Burkina Faso: బుర్కినా ఫాసోలో అనుమానిత జిహాదీలు దాడి.. 42 మంది మృతి

పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని జిహాదీలు జరిపిన దాడిలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 32మంది రక్షణ వాలంటీర్లుతోపాటు, 10మంది సైనికులు ఉన్నారు.

Burkina Faso attack

Burkina Faso: పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని జిహాదీలు జరిపిన దాడిలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 32మంది రక్షణ వాలంటీర్లుతోపాటు, 10మంది సైనికులు ఉన్నారు. ‘అని అరేమా గ్రామ సమీపంలో’ ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఓవహిగౌయా గవర్నరేట్ ధృవీకరించారు. శనివారం సాయత్రం 4గంటల సమయంలో గుర్తుతెలియని జిహాదీలు ఈ దాడులకు దిగారు. రెండు గంటలపాటు ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకున్నట్లు స్థానికులు తెలిపారు.

Burkina Faso : ఉగ్ర‌వాదులు కాల్పలు.. 9 మంది సైనికులు, 10 మంది పౌరులు మృతి

ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. ఈ దాడిలో 50 మంది వరకు అనుమానిత జిహాదీలు పాల్గొన్నట్లు సమాచారం. ఈ ఘటనలో మరో 32మందికి గాయపడ్డారు. వారిని ప్రాంతీయ రాజధాని ఓవహిగౌయా విశ్వవిద్యాలయం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరికిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అయితే, ఆల్ – ఖైదా ఐఎస్ఐఎల్ గ్రూపుతో అనుబంధంగా ఉన్న వారి నుంచి దాడులను ఎదుర్కోవడానికి రాష్ట్రానికి అవసరమైన అన్ని మార్గాలను అందించడానికి బుర్కినా ఫోసో సైనిక ప్రభుత్వం గురువారం సాధారణ సమీకరణ ప్రకటించింది.

Alabama shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురి మృతి.. పలువురు టీనేజర్లకు గాయాలు

ఇదిలాఉంటే, గతవారం రోజుల క్రితం నైజర్ సరిహద్దుకు సమీపంలో ఈశాన్య ప్రాంతంలోని రెండుగ్రామాల్లో సాయుధ తీవ్రవాద గ్రూపులు 44 మంది పౌరులను హతమార్చినట్లు నివేదింబడింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో కెప్టెన్ ఇబ్రహీం ట్రోర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పౌరులపై జరిగిన ఘోరమైన దాడుల్లో 51 మంది సైనికులతో పాటు, వందల సంఖ్యలో ప్రాణాలు విడిచినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

Neeraja Reddy: రోడ్డు ప్రమాదంలో ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి కన్నుమూత

2012లో మాలిలో టువరెగ్ వేర్పాటు వాద తిరుగుబాటును ఇస్లామిస్టులు హైజాక్ చేయడంతో ఈ ప్రాంతంలో అశాంతి మొదలైంది. దీని తరువాత పొరుగున ఉన్న బుర్కినా ఫాసో, నైజర్లలో హింస వ్యాపించింది.