Burkina Faso : ఉగ్ర‌వాదులు కాల్పలు.. 9 మంది సైనికులు, 10 మంది పౌరులు మృతి

ప‌శ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో రక్తమోడింది. ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో 9 మంది సైనికులతోపాటు.. 10 మంది పౌరులు చనిపోయారు.

Burkina Faso : ఉగ్ర‌వాదులు కాల్పలు.. 9 మంది సైనికులు, 10 మంది పౌరులు మృతి

Burkina Faso

Burkina Faso : ప‌శ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో రక్తమోడింది. ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో 9 మంది సైనికులతోపాటు.. 10 మంది పౌరులు చనిపోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సైనికులను టార్గెట్ చేసుకొని ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. దాడి విషయం తెలిసిన వెంటనే మిలటరీ ఫోర్స్ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.

చదవండి : J&K Terrorists : దెబ్బకొట్టారు..తిప్పికొట్టారు, ఐదుగురు ఉగ్రవాదుల హతం

క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి.. ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు. ఉగ్రవాదులు అత్యాధునిక ఆయుధాలను ఉపయోగిస్తుండటంతో దాడులను అదుపు చేయడం అక్కడి సైన్యానికి సవాలుగా మారింది.

చదవండి : Chinese weapons to Terrorists: ఉగ్రవాదుల చేతుల్లో చైనా ఆయుధాలు!

ఇక నెల 14న కూడా ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో 50మంది మిలటరీ పోలీసులు ప్రాణాలు విడవగా 60 మంది గాయపడ్డారు. ఉగ్రదాడికి సంబందించిన వివరాలను సెక్యూరిటీ మినిస్ట‌ర్ మ్యాక్సిం కోనే నేష‌న‌ల్ రేడియోలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.