Russia Serious Warning : చాలా పెద్ద తప్పు చేస్తున్నారు, తీవ్ర పరిణామాలు తప్పవు- ఆ దేశాలకు రష్యా వార్నింగ్

చాలా పెద్ద తప్పు చేస్తున్నారని మండిపడింది. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది.

Russia Serious Warning : తమ మాట వినకుండా నాటోలో చేరేందుకు ఆసక్తి చూపిందనే ఒకే ఒక్క కారణంతో యుక్రెయిన్ పై యుద్ధాన్ని ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇప్పుడు రష్యాకు మరో రెండు దేశాలు తీవ్రమైన కోపాన్ని తెప్పించాయి. అవే ఫిన్ లాండ్, స్వీడన్. దీనికి కారణం ఆ రెండు దేశాలు నాటోలో చేరతామని ప్రకటించడమే.

నాటోలో చేరాలని నిర్ణయించుకున్న ఫిన్లాండ్, స్వీడన్ దేశాలపై రష్యా సీరియస్ అయ్యింది. చాలా పెద్ద తప్పు చేస్తున్నారని మండిపడింది. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ మేరకు రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ హెచ్చరించారు. ఆ రెండు దేశాల నిర్ణయంతో మిలిటరీపరమైన ఉద్రిక్తతలు పెరుగుతాయని చెప్పారు.(Russia Serious Warning)

War (5)

ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే ఆలోచన కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని స్వీడన్, ఫిన్లాండ్ పై మండిపడ్డారు. తాము చూస్తూ ఊరుకుంటామనే భ్రమల్లో నుంచి వారు బయటకు రావాలన్నారు. రష్యాతో ఫిన్లాండ్ దాదాపు 1,300 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ దేశం నాటోలో చేరితే తమ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని రష్యా భావిస్తోంది. ఇదే కారణం వల్లే యుక్రెయిన్ పై రష్యా దండెత్తింది.

Vladimir Putin: పుతిన్‌కు బ్లడ్ క్యాన్సర్.. వెల్లడించిన ఓలిగర్

ఫిన్ లాండ్, స్వీడన్ లు రష్యా పొరుగు దేశాలు. ఈ రెండు దేశాలు సైతం నాటో దిశగానే అడుగులు వేస్తున్నాయి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో చేరేందుకు దరఖాస్తు చేసుకోనున్నట్టు ఫిన్లాండ్ నేతలు గురువారం ప్రకటించారు. ఆ తర్వాత స్వీడన్ సైతం ఫిన్లాండ్ బాటలోనే నడువనున్నట్టు ప్రకటించింది. నాటో కూటమిలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేస్తామని ఫిన్లాండ్ అధ్యక్షుడు, ప్రధాని ప్రకటించారు. దీనికి కారణం రష్యానే అని ఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలి నినిస్తో అన్నారు. ఈ పరిణామాల పట్ల రష్యా అధ్యక్ష కార్యాలయం తీవ్రంగా స్పందించింది. సైనిక, సాంకేతిక చర్యలతో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది.(Russia Serious Warning)

War (2)

కాగా, గత 75 ఏళ్లుగా సైనికపరంగా ఫిన్లాండ్ తటస్థంగా ఉంది. అయితే, ఫిబ్రవరిలో యుక్రెయిన్ పై రష్యా సైనిక చర్యకు దిగడంతో ఫిన్లాండ్ లో పరిస్థితులు నాటో సభ్యత్వానికి అనుకూలంగా మారాయి. నాటోలో చేరొద్దని రష్యా హెచ్చరించినా ఫిన్లాండ్ తలొగ్గలేదు.

ఫిన్లాండ్ మాదిరే స్వీడన్ కూడా ఆలోచన చేస్తోంది. ఉక్రెయిన్ పై రష్యా దాడి చూసిన తర్వాత నాటోలో చేరడమే మంచిదన్న అభిప్రాయం ఫిన్లాండ్, స్వీడన్ నేతలు, ప్రజల్లో బలపడుతోంది. స్వీడన్, ఫిన్లాండ్ కు కూటమి స్వాగతం పలుకుతున్నట్టు నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్ బర్గ్ ప్రకటన చేశారు.(Russia Serious Warning)

Finland

ఇదే జరిగితే రష్యా చుట్టూ నాటో చేరినట్టు అవుతుంది. అది తమకు ఎప్పటికీ ముప్పే అని రష్యా భావిస్తోంది. యుక్రెయిన్ పై పుతిన్ దాడి చేయడానికి నేపథ్యం ఇదే. నాటోలో చేరితే.. తనకు పక్కలో బల్లెంలా ఉక్రెయిన్ మారుతుందని.. రష్యా భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఆయన భావిస్తున్నారు. నాటోలో చేరొద్దని ఉక్రెయిన్ ను ఎన్నోసార్లు హెచ్చరించారు. అయినా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పుతిన్ మాటలను పెడచెవిన పెట్టారు. దీంతో చివరికి ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగింది. మూడు నెలలు అవుతున్నా అది కొలిక్కి రావడం లేదు.

EU Funds For Ukraine : యుక్రెయిన్‌కు మరో రూ.4వేల కోట్లు.. భారీ ఆర్థిక సాయం ప్రకటించిన ఈయూ

ఇప్పుడు ఫిన్లాండ్, స్వీడన్ నాటోలో చేరాలనుకోవడం రష్యా ఆందోళనలను మరింత పెంచేదే. ఒకవైపు ఉక్రెయిన్ నాటోలో చేరకపోయినా ఆ దేశానికి పరోక్షంగా నాటో, అమెరికా భారీ ఆయుధాలతో మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ పై రష్యా పైచేయి సాధించలేకపోతోంది. నాటో, రష్యా మధ్య ప్రత్యక్ష ఘర్షణకు ఈ చర్యలు దారితీస్తాయని రష్యా అధ్యక్ష కార్యాలయం హెచ్చరించింది. పూర్తి స్థాయి అణు యుద్ధానికి దారితీయవచ్చంది.

Finland Sweden

ట్రెండింగ్ వార్తలు