EU Funds For Ukraine : యుక్రెయిన్‌కు మరో రూ.4వేల కోట్లు.. భారీ ఆర్థిక సాయం ప్రకటించిన ఈయూ

యుక్రెయిన్ కు ఆర్థిక సాయం అందించాలని యూరప్ సమాఖ్య నిర్ణయించింది. భారీ ఆయుధాల కొనుగోలు కోసం రూ.4వేల కోట్లు.. (EU Funds For Ukraine)

EU Funds For Ukraine : యుక్రెయిన్‌కు మరో రూ.4వేల కోట్లు.. భారీ ఆర్థిక సాయం ప్రకటించిన ఈయూ

Eu Funds For Ukraine

EU Funds For Ukraine : యుక్రెయిన్ కు మరోసారి ఆర్థిక సాయం అందించాలని యూరప్ సమాఖ్య నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.4వేల కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. భారీ ఆయుధాల కొనుగోలు కోసం అదనంగా రూ.4,027 కోట్లు (520 మిలియన్ డాలర్లు) సాయం అందించాలని యూరోపియన్ యూనియన్(ఈయూ) తీర్మానించింది. దీంతో యుక్రెయిన్ కు ఈయూ చేసిన మొత్తం సాయం రూ.16వేల 264 కోట్లకు(2.1 బిలియన్ డాలర్లు) చేరింది. మరోవైపు రష్యాకు వ్యతిరేకంగా కలిసికట్టుగా నిలబడతామని జీ-7 దేశాల కూటమి నేతలు స్పష్టం చేశారు.

మరోవైపు రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. నెలలు గడుస్తున్నా రష్యా సేనల దాడులు ఆగడం లేదు. యుక్రెయిన్ లోని పలు ప్రాంతాలపై ఇంకా రష్యా బలగాలు క్షిపణులు, బాంబుల వర్షం కురిపిస్తున్నాయి.(EU Funds For Ukraine)

War (2)

War (2)

Shireen Abu Akleh: ఇజ్రాయెల్ కాల్పుల్లో రిపోర్టర్ మృతి

యుద్ధంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. ఈ యుద్ధం ఎన్నాళ్లు సాగుతుందో చెప్పలేము అంటూ వాపోయారు. తమ దేశం నుంచి రష్యన్లను వెళ్లగొట్టేందుకు మా సైనికులు చేయాల్సిందంతా చేస్తున్నారని చెప్పారు. కానీ ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ అంచనా వేయలేరన్నారు. దీని ముగింపు మా ఒక్కరిపైనే ఆధారపడిలేదన్న జెలెన్క్ స్కీ.. మా భాగస్వాములపై ఆధారపడి ఉంటుందని తేల్చి చెప్పారు. యూరప్ దేశాలపై, మొత్తం స్వేచ్ఛా ప్రపంచంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఈ మేరకు జెలెన్‌స్కీ వీడియో సందేశం ఇచ్చారు.

War (3)

War (3)

ఈ యుద్ధంలో తమ సైనికులు అత్యున్నతంగా పోరాడుతున్నారని జెలెన్ స్కీ ప్రశంసించారు. తమ వాళ్ల దాడుల్లో.. రష్యా భారీగా నష్టపోయిందని చెప్పారు. ట్యాంకులు, వాహనాలు, హెలికాఫ్టర్లు, డ్రోన్లను కోల్పోయిందన్నారు. పుతిన్‌ సేనల నుంచి తమ పట్టణాలు, గ్రామాలను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని, అక్కడ నిత్యావసర సదుపాయాలను పునరుద్ధరిస్తున్నామన్నారు. కాగా, విద్యా సంస్థలను ధ్వంసం చేస్తే రష్యాకు ఏం వస్తుందని జెలెన్‌స్కీ నిలదీశారు. ఇప్పటివరకూ 101 ఆసుపత్రులను, 570 వైద్య వసతులను రష్యా సైనికులు ధ్వంసం చేశారని వాపోయారు.

మరోవైపు యుద్ధం నిలిపివేతపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్‌ 75 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడారు. యుక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని, క్షేత్రస్థాయిలో మానవతా పరిస్థితి మెరుగుపడేలా చూడాలని కోరారు.

Ukraine Russia War : యుక్రెయిన్‌లో యుద్ధ బీభత్సం.. ఒక్కరోజులోనే 26 దాడులు..!

కాగా, రష్యా బలగాలు యుక్రెయిన్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని శుక్రవారం ముమ్మరంగా దాడులు చేపట్టాయి. అత్యంత కీలక పారిశ్రామిక నగరం క్రెమెన్‌చుక్‌లోని చమురు శుద్ధి కర్మాగారంపై 12 క్షిపణుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో అక్కడి మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి.(EU Funds For Ukraine)

War (4)

War (4)

తీర నగరం మరియుపోల్, పారిశ్రామిక ప్రాంతం డాన్‌బాస్‌లలో పట్టు కోసం యుక్రెయిన్, రష్యా బలగాలు భీకరంగా పోరాడుతున్నాయి. రష్యా బలగాలు ఇళ్లు, ఆసుపత్రులు, విద్యార్థులు ఉండే డార్మెటరీలపై క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఈ ధాటికి డాన్‌బాస్‌లో నలుగురు, చెర్నిహైవ్‌లో ముగ్గురు, ఖార్కివ్‌లో ఇద్దరు పౌరులు మృతి చెందారు.

War (5)

War (5)

యుక్రెయిన్‌లోని ఉత్తర, తూర్పు, మధ్య ప్రాంతాలపైనా మాస్కో సేనలు విరుచుకుపడ్డాయి. మిగతాచోట్ల మాత్రం జెలెన్‌స్కీ బలగాలు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తున్నాయి. ఈశాన్య ప్రాంతంలో చేజారిన పలు పట్టణాలు, గ్రామాలను తిరిగి చేజిక్కించుకున్నాయి. నల్ల సముద్రంలో రష్యాకు చెందిన మరో యుద్ధనౌకను తమ సేనలు మట్టుబెట్టాయని అధ్యక్షుడు జెలెన్‌స్కీ సలహాదారుడు ఒలెక్సీ అరెస్టోవిచ్‌ తెలిపారు.

కాగా, రష్యాతో తాము చర్చలకే సిద్ధమే అని యుక్రెయిన్‌ విదేశాంగమంత్రి దిమిత్రి కులేబా ప్రకటించారు. సంక్షోభ నివారణకు రష్యా నాయకత్వంతో దౌత్య చర్చలు జరిపి, రాజకీయ పరిష్కారం కనుగొనేందుకు తాము ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నామన్నారు. అయితే, రష్యా నుంచే ఎలాంటి సానుకూల స్పందన రావడం లేదన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగిన విషయం తెలిసిందే. తొలుత ఉక్రెయిన్‌ సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకున్నామని చెప్పిన మాస్కో.. ఆ తర్వాత సాధారణ జనావాసాలపైనా విరుచుకుపడింది. నానాటికీ ఈ యుద్ధం తీవ్రరూపం దాల్చడమే గాక, వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. రష్యా సేనల దాడుల్లో ఉక్రెయిన్‌లోని పలు నగరాల్లో పూర్తిగా ధ్వంసం అయ్యాయి. పలు ప్రాంతాలు నామరూపాలు లేకుండా పోయాయి.