Ukraine Russia War : యుక్రెయిన్‌లో యుద్ధ బీభత్సం.. ఒక్కరోజులోనే 26 దాడులు..!

Ukraine Russia War : యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. చర్చలతో ఇరుదేశాల మధ్య రాజీ కుదరడం లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం యుద్ధంలో వెనక్కి తగ్గడం లేదు.

Ukraine Russia War : యుక్రెయిన్‌లో యుద్ధ బీభత్సం.. ఒక్కరోజులోనే 26 దాడులు..!

Ukraine Russia War Russian Forces Launched 26 Attacks On Towns And Villages In Luhansk Region

Ukraine Russia War : యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. చర్చలతో ఇరుదేశాల మధ్య రాజీ కుదరడం లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం యుద్ధంలో వెనక్కి తగ్గడం లేదు. యుక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్నాడు. రష్యా టార్గెట్ ప్రాంతమైన లుహాన్క్స్‌లో ఒక్క రోజులోనే రష్యా 26 దాడలకు పాల్పడింది. వరుస బాంబు దాడులు, క్షిపణుల ప్రయోగాలతో రష్యా విరుచుకుపడింది. రష్యా సైనికుల దాడులతో యుక్రెయిన్‌ తూర్పు ప్రాంతం లుహాన్స్క్‌ దద్దరిల్లింది. రష్యా బాంబు దాడులు, క్షిపణుల ప్రయోగాలతో విరుచుకుపడింది. ఆయుధ డిపోలను ధ్వంసం చేసింది.

పాఠశాల భవనంపైనా బాంబులు వేసింది. ఈ దాడుల్లో డజన్లకొద్దీ భవనాలు దెబ్బతిన్నాయి. తూర్పు ప్రాంతంలో రష్యా ముందుడగు వేయడంతో పాక్షిక విజయం సాధించినట్లయ్యింది. యుక్రెయిన్ లోనిక చొచ్చుకుని వస్తున్న రష్యా దళాల 9 దాడులను తమ దళాలు తిప్పికొట్టాయని యుక్రెయిన్‌ ప్రకటించింది. ఉత్తర ప్రాంతంలోని ఖార్కీవ్‌, చెర్నిహీవ్‌, సూమీలోనూ రష్యా దాడులు చేస్తోంది. నొవ్హొరోడ్‌-సివర్‌స్కీలో స్కూళ్లపైనా బాంబులు వేసింది. ఒడెసా నగరంపైనా బాంబుల వర్షం కురిపించింది రష్యా. ఈ దాడిలో ఐదు బిల్డింగ్‌లు ధ్వంసమయ్యాయి.

Ukraine Russia War Russian Forces Launched 26 Attacks On Towns And Villages In Luhansk Region (1)

Ukraine Russia War Russian Forces Launched 26 Attacks On Towns And Villages In Luhansk Region

షాపింగ్‌ మాల్‌లో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులో తెచ్చారు. యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదని అమెరికా నిఘా వర్గాలు ప్రకటించాయి. రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం సుదీర్ఘకాలం పాటు కొనసాగేలా కనిపిస్తోందని అంటున్నాయి. యుక్రెయిన్‌లోని నల్లసముద్రం తీరం వరకు రష్యా ల్యాండ్‌ బ్రిడ్జ్‌ ఏర్పాటు చేసిందని నిఘా వర్గాలు తెలిపాయి.

Read Also : Russia vs ukraine war: యుక్రెయిన్‌లో రష్యా సైన్యం దాడులు ఎందుకు.. ఎప్పటి వరకు చేస్తుందో స్పష్టం చేసిన పుతిన్